రెండు ఇళ్లలో చోరీ

ABN , First Publish Date - 2023-02-21T23:33:23+05:30 IST

పట్టణంలోని వెంకటరాజంపేటలో సోమవారం అర్ధరాత్రి సమయంలో రెండు ఇళ్లలో చోరీ జరిగి సుమారు రూ.లక్ష విలువ చేసే బంగారు అపహరణ జరిగినట్లు ఎస్‌ఐ భక్తవత్సలం తెలిపారు.

రెండు ఇళ్లలో చోరీ

లక్ష విలువ చేసే బంగారు అపహరణ

రాజంపేటటౌన్‌, ఫిబ్రవరి 21: పట్టణంలోని వెంకటరాజంపేటలో సోమవారం అర్ధరాత్రి సమయంలో రెండు ఇళ్లలో చోరీ జరిగి సుమారు రూ.లక్ష విలువ చేసే బంగారు అపహరణ జరిగినట్లు ఎస్‌ఐ భక్తవత్సలం తెలిపారు. పూలపద్మావతమ్మ ఇంట్లో ఒక తులం బంగారు, రెండు వెండి దీపాలు, రెండు వెండి గిన్నెలు, అలాగే వి.సౌభాగ్య ఇంటిలో నాలుగు జతల బంగారు కమ్మలు, వెండి గొలుసులు, ఒక సెల్‌ఫోన్‌ చోరీ జరిగినట్లు తెలిపారు. ఇంటిలో ఎవ్వరూ లేకపోవడంతో ఈ అపహరణ జరిగిందన్నారు. దీనిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - 2023-02-21T23:33:24+05:30 IST