మురుగు కాలువలు నిర్మించండి

ABN , First Publish Date - 2023-09-25T23:33:34+05:30 IST

వర్షం వస్తే మురుగునీరు రోడ్లపై ప్రవ హించకుండా కాలువలు నిర్మించాలని బీఎస్పీ నాయకులు డిమాండ్‌ చేశారు.

మురుగు కాలువలు నిర్మించండి
మహిళలతో కలిసి నిరసన వ్యక్తం చేస్తున్న బీఎస్పీ నాయకులు

ములకలచెరువు, సెస్టెంబరు 25: వర్షం వస్తే మురుగునీరు రోడ్లపై ప్రవ హించకుండా కాలువలు నిర్మించాలని బీఎస్పీ నాయకులు డిమాండ్‌ చేశారు. స్థానిక ఉమాశంకర్‌రెడ్డి కాలనీలో సోమవారం వర్షంతో ఇళ్ళ ముందు నిలిచిన మురుగునీరులో నిలబడి స్థానిక మహిళలు ఆందో ళనకు దిగారు. ఈ సందర్భంగా బీఎస్పీ మండల అధ్యక్షుడు కె.షఫీ మా ట్లాడుతూ ఉమాశంకర్‌రెడ్డి కాలనీ, రాగిమానిపల్లెలో మురుగు కాలువలు లేక వర్షం వస్తే నీరు ఇళ్ళ ముందు ప్రవహించి పెద్ద ఎత్తున నిల్వ ఉం టోందన్నారు. ప్రభుత్వం స్పందించి మురికినీటి కాలువలు నిర్మించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు మహిళలు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-25T23:33:34+05:30 IST