మార్కెట్‌ నిర్మాణానికి బ్రేక్‌

ABN , First Publish Date - 2023-03-19T23:20:50+05:30 IST

ప్రొద్దుటూరు పట్టణ నడిబొడ్డున ఉన్న కూరగాయ మార్కెట్‌నుకూలగొట్టిన స్థానంలోనే తిరిగి మార్కెట్‌ను ఆధునికీకరించే పనులను గత ఏడాది నవంబర్‌ 16న వైసీపీ నేతలు సజ్జల, అవినాశ్‌, రాచమల్లు ఆధ్వర్యంలో అట్టహాసంగా ప్రారంభించారు.

మార్కెట్‌ నిర్మాణానికి బ్రేక్‌
శివాలయం రోడ్డులోని కూరగాయల మార్కెట్‌ నిర్మాణ పనులు నిలిచిపోయిన దృశ్యం

నెలన్నరకు పైగా ఆగిన పనులు

నిర్మాణ ఆకృతులకు ఎస్‌ఈ నుంచి రాని అనుమతులు

నాలుగు నెలలు దాటినా మట్టి పనులకే పరిమితం

పుట్టింగ్స్‌ సైతం మొదలుకాని వైనం

సకాలంలో మార్కెట్‌ నిర్మాణం పూర్తి అయ్యేనా

ప్రొద్దుటూరు అర్బన్‌, మార్చి 19: ప్రొద్దుటూరు పట్టణ నడిబొడ్డున ఉన్న కూరగాయ మార్కెట్‌నుకూలగొట్టిన స్థానంలోనే తిరిగి మార్కెట్‌ను ఆధునికీకరించే పనులను గత ఏడాది నవంబర్‌ 16న వైసీపీ నేతలు సజ్జల, అవినాశ్‌, రాచమల్లు ఆధ్వర్యంలో అట్టహాసంగా ప్రారంభించారు. పట్టణంలో వేలాది మందికి విందు భోజనం ఏర్పాటు చేసిఎన్నికల సభను మించిన తరహాలో మార్కెట్‌భూమి పూజ కార్యక్రమం చేపట్టారు. నాలుగు నెలలు దాటినా నేటికీ ఆ ప్రాంగణంలో మట్టిని తవ్విపోయటం తప్ప కనీసం పిల్లర్‌ గుంతలు (పుట్టింగ్‌) సైతం తీయలేదు. దాదాపు మూడు మీటర్ల లోతున రెండెకరాల విస్తీర్ణంలో మట్టిని తవ్వి తీశారు. ఈ విలువైనమట్టిని బయటికి తరలించారు. కానీ నేటికీ పునాదులకు తీసే పుట్టింగులు కూడా తవ్వలేదు. కారణం ఇంకా నిర్మాణ ఆకృతులకు అనుమతులు రాలేదని అధికారులు వెల్లడిస్తున్నారు.

4.79 శాతం ఎక్సెస్‌ రేట్లకు టెండర్‌ ఖరారు

రూ.50.90 కోట్ల అంచనాతో సీఎం జగన్‌ కూరగాయలమార్కెట్‌ నిర్మాణానికి 2021 డిసెంబరు 22 న ప్రొద్దుటూరుకు వచ్చినప్పుడు శంకుస్థాపన చేసి పరిపాలనా అనుమతులు జారీ చేశారు. ఆర్థిక అనుమతులతో, పాటు మార్కెట్‌ నిర్మాణ ఆకృతికి సాంకేతిక అనుమతులను 27 జులై 2022న ఇచ్చారు. సెప్టంబరు 2022న రూ.50.90 కోట్లకు టెండరును ప్రొద్దుటూరు మున్సిపల్‌ అధికారులు పిలిచారు. 4.79 శాతం ఎక్సెస్‌తో కేసీపీ సంస్థ టెండర్‌ను దక్కించుకుంది. అక్టోబరు 29న మున్సిపల్‌ అధికారులు వర్కు ఆర్డర్‌ జారీ చేశారు. అప్పటి నుంచి రెండు సంవత్సరాల లోపు మార్కెట్‌ నిర్మాణాన్ని పూర్తి చేయాల్సి ఉంది. అప్పుడే నాలుగున్నర నెలలు గడువు ముగిసింది. కానీ నేటికి అక్కడ మట్టి తవ్వకాలు తప్ప మరే సిమెంటు పని జరగటంలేదు. దీనికి తోడు దాదాపు నెలన్నర రోజులుగా కాంట్రాక్టర్‌ నిర్మాణ ఆకృతులకు అనుమతులు రాక పనులు నిలిపివేశారు.

మున్సిపల్‌ అధికారులు కాంట్రాక్ట్‌ ఇచ్చినకన్సల్టెన్సీసంస్థ తయారు చేసిన నిర్మాణ ఆకృతులు సరిగా లేకపోవడంతో ఎస్‌ఈ అనంతపురం వారు వాటిని రిజక్ట్‌ చేసినట్లు సమాచారం. మార్పుచేర్పులు చేసుకోని తీసుకొని రావాలని ఆదేశించారు. ఈ ప్రక్రియ ఆలస్యంతో మార్కెట్‌ నిర్మాణ పనులు మరింత ఆలస్యం అయ్యే పరిస్థితి ఏర్పడనుంది. ఈ రెండు నెలలు దాటితే జూన్‌లో వర్షాలు ప్రారంభం అవుతాయి. అప్పుడు పనులకు ఆటంకం ఏర్పడుతుంది. అధికారులు ముందుచూపు లేకుండా నిర్లక్ష్యంగా వ్వవహ రించటం వల్లే మట్టిపని పూర్తయ్యే లోపు స్ట్రక్చరల్‌ డిజైన్స్‌కు డ్రాయింగ్స్‌కు ఎస్‌ఈ అనుమతులు తీసుకురాలేకపోయారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అందువల్లే కాంట్రాక్టర్‌ సైతం నెలన్నర రోజులుగా పనులు నిలిపివేసినట్లు సమాచారం.

రూ.40 లక్షల మేరకు జరిగిన పనులు

ఇప్పటి వరకు దాదాపు రూ.40 ల క్షల మేరకు మట్టి పనులు పూర్తి అయినట్లు మున్సిపల్‌ అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ పనులు రికార్డు చేసి బిల్లులు కూడా పంపినట్లు సమాచారం. దాదాపు రూ.6 కోట్ల మేర పనులకు నిధులు విడుదల చేయాలని మున్సిపల్‌ అధికారులు ఉన్నతాధికారులను కోరినట్లు సమాచారం. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు ఈ నిధులు మంజూరు కాకపోతే తర్వా ప్రభుత్వం నుంచి రాకపోవచ్చని సమాచారం. మళ్లీ బడ్జేట్‌లో ఆమోదం తీసుకుని నిధులు విడు

దల చేయాల్సి ఉంటుందని అంటున్నారు. దీంతో బిల్లులు సైతం ఆలస్యం కావచ్చని చెబుతున్నారు.

స్ట్రక్చరల్‌ డ్రాయింగ్‌ అప్రూవల్స్‌ ఫైనల్‌ కాలేదు..

మార్కెట్‌ నిర్మాణానికి సంబంధించిన స్ట్రక్చరల్‌ డిజైన్స్‌ ఎస్‌ఈ అనంతపురం వారు అనుమతులు ఇవ్వల్సి ఉంది. ఇంకా డిజైన్స్‌ ఫైనల్‌ కాలేదు. గతంలో కన్సల్‌ టెన్సీ సంస్థ తయారుచేసి పంపిన డిజైన్స్‌ను ఎస్‌ఈ మార్పులు చేయమని తిరిగి పంపారు. త్వరలో ఎస్‌ఈ నుంచి డిజైన్స్‌ అప్రూవల్స్‌ రాగానే పుట్టింగ్‌ పనులు ప్రారంభింస్తాం. నెలరోజులుగా పనులు నిచిలిచిన మాట వాస్తవమే.

-సాయి క్రిష్ణ, మున్సిపల్‌ ఈఈ, ప్రొద్దుటూరు

Updated Date - 2023-03-19T23:20:50+05:30 IST