ప్రైవేట్‌ ఆస్పత్రుల్లోనూ జనన,మరణాలు నమోదు చేయాలి : డీఎంహెచ్‌ఓ

ABN , First Publish Date - 2023-03-18T23:48:32+05:30 IST

ప్రైవేట్‌, కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో జరిగే ప్రసవాలు, మరణాలు ఎప్పటికప్పుడు పోర్టల్‌లో నమోదు చేయాలనీ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ నాగరాజు ఆదేశించారు.

ప్రైవేట్‌ ఆస్పత్రుల్లోనూ జనన,మరణాలు  నమోదు చేయాలి :  డీఎంహెచ్‌ఓ
పోస్టరును విడుదల చేస్తున్న డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్‌ నాగరాజు

కడప(కలెక్టరేట్‌) మార్చి 18: ప్రైవేట్‌, కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో జరిగే ప్రసవాలు, మరణాలు ఎప్పటికప్పుడు పోర్టల్‌లో నమోదు చేయాలనీ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ నాగరాజు ఆదేశించారు. శనివారం డీఎంఅండ్‌హెచ్‌ఓ కార్యాలయంలో కడప డివిజన్‌ పరిధి ప్రైవేట్‌ ఆస్పత్రుల యాజమాన్యంతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీజనల్‌ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ఆస్పత్రుల్లో చేరే డెంగ్యూ, మలేరియా, టీ బీ బాధితుల వివరాలను కూడా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలన్నారు.

డాక్టర్‌ ఉమామహేశ్వర కుమార్‌ మాట్లాడుతూ రోడ్లు యాక్సిడెంట్లు జరిగినపుడు ఆ వివరాలను కూడా 1-ఆర్‌ఏడీ యాప్‌లో నమోదు చేయాలన్నారు. ప్రైవేట్‌ ఆస్పత్రుల, స్కానింగ్‌ సెంటర్ల రికార్డులను ఖచ్చితంగా మెయింటైన్‌ చేసి పీసీపీఎన్‌ డీటీ పోర్టల్‌లో నమోదు చేయాలనీ ప్రమీల పేర్కొన్నారు. డాక్టర్లు శశిభూషణ్‌ రెడ్డి,ఎస్‌ ఓ జార్జీ, ఎపిడియాలజిస్టు, మలేరియా అధికారి మనోరమ, ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్‌ ఫరూక్‌, ప్రైవేట్‌ ఆస్పత్రుల యాజమాన్యం పాల్గొన్నారు.

Updated Date - 2023-03-18T23:48:45+05:30 IST