రాగిలో బయో ఫోర్టిఫై రకం ఉత్తమం
ABN , First Publish Date - 2023-06-26T22:41:26+05:30 IST
రాగి పంట సాగుకు కొత్తగా కనిపెట్టిన బయోఫోర్టిఫై రకం ఇంద్రావతి విత్తనం ఉత్తమమని కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త సోమశేఖర్ తెలిపారు.
మదనపల్లె టౌన్, జూన్ 26: రాగి పంట సాగుకు కొత్తగా కనిపెట్టిన బయోఫోర్టిఫై రకం ఇంద్రావతి విత్తనం ఉత్తమమని కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త సోమశేఖర్ తెలిపారు. ఈ అంశంపై సోమవారం సీటీఎం ఆర్‌బీకేలో రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సోమశేఖర్ మాట్లాడుతూ బయోపోర్టిఫై రకం రాగి విత్తనాల్లో ఎక్కువ పోషక విలువలు ఉంటాయన్నారు. కాల్షియం, ఐరన్, జింక్ ఈ రాగుల్లో ఉంటాయన్నారు. పోషక విలువలు ఎక్కువగా ఉన్న ఈ రాగులు గర్భిణులు, వృద్ధులకు ఎంతో ఉపయోగపడతాయ న్నారు. అనంతరం ఎంపిక చేసిన ఆరుగురు రైతులకు బయోఫోర్టిఫై ఇంద్రావతి రకం రాగుల విత్తనాలను అందజేశారు. కార్యక్ర మంలో కేవీకే శాస్త్రవేత్త మాధురి, ఆర్‌బీకే వీఏఏ సుబ్రమణ్యం పాల్గొన్నారు.