ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలి

ABN , First Publish Date - 2023-04-26T23:39:27+05:30 IST

ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చేవారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని బద్వేలు డివిజన్‌ జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్‌ చంద్రహాసరెడ్డి పేర్కొన్నారు.

ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలి
మాట్లాడుతున్న డాక్టర్‌ చంద్రహాసరెడ్డి

దువ్వూరు, ఏప్రిల్‌ 26: ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చేవారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని బద్వేలు డివిజన్‌ జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్‌ చంద్రహాసరెడ్డి పేర్కొన్నారు. బుధవారం దువ్వూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసి ప్రతి కార్యక్రమంలో వంద శాతం లక్ష్యాలు సాధించాలని, ఫ్యామిలీ ఫిజీషియన్‌ కాన్సెప్ట్‌ కార్యక్రమంలో భాగంగా ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలన్నారు. అనంతరం రికార్డులు తనిఖీ చేసి సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైద్యులు డాక్టర్‌ సురే్‌షబాబు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2023-04-26T23:39:40+05:30 IST