ధ్యాన కేంద్రం ప్రారంభం
ABN , First Publish Date - 2023-03-19T23:16:59+05:30 IST
పట్టణంలోని న్యాక్ బిల్డింగ్ వెనుక 19.50ఎకరాల్లో రూ.2కోట్లతో కొత్తగా విపశ్వన శిబిరం (జిప్సీ) అంతర్జాతీయ ధ్యాన కేంద్రం ఆదివా రం ప్రారంభించారు.

పులివెందుల టౌన్, మార్చి 19: పట్టణంలోని న్యాక్ బిల్డింగ్ వెనుక 19.50ఎకరాల్లో రూ.2కోట్లతో కొత్తగా విపశ్వన శిబిరం (జిప్సీ) అంతర్జాతీయ ధ్యాన కేంద్రం ఆదివా రం ప్రారంభించారు. ఆచార్యులు మోహన్‌రాజ్, శబరిన కటకం ద్వారా ధ్యానకేంద్రం ప్రారంభించారు. ఈ శిబిరం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఆరుచోట్ల ఉందన్నారు. పులివెందుల ప్రజలకు ఆరు నెలల్లో పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందని వారు వివరించారు. మనసుని నిర్మలపరిచే విద్య దొరకడం చాలా అరుదని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఇదిలా ఉండగా పులివెందులలో ధ్యాన కేంద్రం ఏర్పాటుకు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డికి చెందిన 19.50ఎకరాలు ఆయన కుటుం బ సభ్యులు ధ్యాన కేంద్రానికి ఉచితంగా ఇచ్చారు. కార్యక్రమంలో వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత, అల్లుడు రాజశేఖర్‌రెడ్డి, పట్టణంలోని ప్రజలు పాల్గొన్నారు.