ధైర్యంగా ఉండండి...పార్టీ అండగా ఉంటుంది

ABN , First Publish Date - 2023-09-04T00:03:00+05:30 IST

ధైర్యంగా ఉండిండి...పార్టీ అన్ని విధాల అండగా ఉంటుందని టీడీపీ తంబళ్ళపల్లె నియోజక వర్గ పరిశీలకుడు గురవారెడ్డి పే ర్కొన్నారు.

ధైర్యంగా ఉండండి...పార్టీ అండగా ఉంటుంది
టీడీపీ శ్రేణులతో సమావేశమైన పరిశీలకుడు గురవారెడ్డి

టీడీపీ నియోజకవర్గ పరిశీలకుడు గురవారెడ్డి

ములకలచెరువు, సెప్టెంబర్‌ 3: ధైర్యంగా ఉండిండి...పార్టీ అన్ని విధాల అండగా ఉంటుందని టీడీపీ తంబళ్ళపల్లె నియోజక వర్గ పరిశీలకుడు గురవారెడ్డి పే ర్కొన్నారు. కురబలకోట మండ లం అంగళ్ళు ఘనటకు సంబం ధించి నమోదైన కేసుల్లో అరెస్టై జైలులో ఉన్న టీడీపీ శ్రేణుల కుటుంబాలను ఆదివారం ఆయన పరామర్శించారు. అలాగే మదనపల్లెలోని నియోజక వర్గ పార్టీ కార్యాలయంలో పలువురు నాయకులతో సమావేశమయ్యారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆదేశాలతో పరా మర్శకు వచ్చానన్నారు. ఎలాంటి భయాందోళనకు గురికావద్దన్నారు. అక్రమ అరెస్టులతో జైలులో ఉన్న వారి బైయిల్‌ కోసం పార్టీ తరపున లాయర్లు కృషి చేస్తున్నారన్నారు. అరాచక వైసీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయన్నారు. ఆయన వెంట పలువురు నాయకులు ఉన్నారు.

Updated Date - 2023-09-04T00:03:00+05:30 IST