అరటి పరిశోధన కేంద్రాన్ని త్వరగా పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2023-05-02T23:21:03+05:30 IST

పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని బ్రాహ్మణపల్లె వద్ద కొత్తగా నిర్మిస్తున్న అరటి పరిశోధన కేంద్రం పనులు త్వరితగతిని చేపట్టి పూర్తి చేయాలని మార్కెటింగ్‌ శాఖ సీఈ శ్రీనివాస్‌ ఆదేశించారు.

అరటి పరిశోధన కేంద్రాన్ని త్వరగా పూర్తి చేయాలి
గోదాం మ్యాప్‌ను పరిశీలిస్తున్న అధికారులు

పులివెందుల టౌన, మే 2: పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని బ్రాహ్మణపల్లె వద్ద కొత్తగా నిర్మిస్తున్న అరటి పరిశోధన కేంద్రం పనులు త్వరితగతిని చేపట్టి పూర్తి చేయాలని మార్కెటింగ్‌ శాఖ సీఈ శ్రీనివాస్‌ ఆదేశించారు. మంగళవారం ఆయన ఏడీ వెంకటే శ్వర్లు, డీహెచఓ మైఖేల్‌ రాజీవ్‌, ఏడీహెచ సుభాషిణి, ఈఈ వెంక టేశ్వరరావు, డీఈ పాహిం, విజిలెన్స జేడీ రాజశేఖర్‌ తదితరులతో కలసి ఆరటి పరిశోధన కేంద్రాన్ని పరిశీ లించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అరటి పరిశోధన కేంద్రం పనులను నాణ్య తతో చేపట్టి.. రెండు నెలల్లోపు పూర్తి చేయాలని గుత్తేదారులకు సూచించారు. అనంతరం గోదాము పనులను పరిశీలించి త్వరగా పూర్తి చేయాలన్నారు. పనులు పూర్తయితే ఈ ఏసీ గోదాముల్లో రైతులు అరటి నిల్వ చేసుకు నేందుకు వీలుగా ఉంటుందన్నారు. తదనంతరం అరటి జ్యూస్‌, అరటి చిప్స్‌ తయారీ కేంద్రం పనులను వారు పరిశీ లించారు. ఈపనులు కూడా త్వరిత గతిన పూర్తి చేయా లని సూచించారు. కార్యక్రమంలో మార్కెట్‌యార్డు చైర్మన చిన్నప్ప, ఏపీఎంఐపీ పీడీ రవీంద్రనాథ్‌రెడ్డి, హెచఓ రాఘవేంద్రరెడ్డి, మార్కెటింగ్‌ ఏడీ ఆజాద్‌వలి, ఏఈ మేఘనాథ్‌, వైఎస్సార్‌ హార్టికల్చర్‌ యూనివర్సిటీ డైరెక్టర్‌ శివప్రసాద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-05-02T23:21:03+05:30 IST