విత్తన గుళికల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించాలి
ABN , First Publish Date - 2023-03-02T23:35:48+05:30 IST
విత్తన గుళికలు, చిరుధాన్యాల పంటల ప్రాముఖ్యతపై రైతులకు అవగాహన కల్పించాలని రాయలసీమ రీజియన్ ప్రాజె క్టు కో-ఆర్డినేటర్ చంద్రశేఖర్, నాబార్డ్ డీడీఎం విజయ్ విహారి పేర్కొన్నారు.
కడప(రూరల్)మార్చి 2: విత్తన గుళికలు, చిరుధాన్యాల పంటల ప్రాముఖ్యతపై రైతులకు అవగాహన కల్పించాలని రాయలసీమ రీజియన్ ప్రాజె క్టు కో-ఆర్డినేటర్ చంద్రశేఖర్, నాబార్డ్ డీడీఎం విజయ్ విహారి పేర్కొన్నారు. గురువారం జిల్లా పకృతి వ్యవసాయ ప్రాజెక్టు మేనేజర్ కార్యాలయంలో పకృతి వ్యవసాయ సిబ్బందికి విత్తన గుళికలు, పీఎండీఎస్ పంటలపైన నిర్వహించిన అవగాహన సమావేశం లో వారు మాట్లాడుతూ పకృతి వ్యవసాయ సిబ్బంది అందరూ వారి పరిధిలోని రైతులకు విత్తన గుళికల ప్రాముఖ్యతపై అవగాన కల్పించాలన్నారు. పలు చిరుధాన్యాల పంటలు సాగుతో భూమిని 365 రోజులు కప్పివుంచే పక్రియను తెలిపి ప్రతి రైతు సాగుచేసేలా చూడాలన్నారు.
పీఎండీఎస్ సాగుకు కావాల్సిన సీడ్ కిట్స్‌ని తయారుచేసుకుని రైతులకు అందుబాటులో ఉంచాలన్నారు. పకృతి వ్యవసాయం చేస్తున్న అర్హులైన ఎస్సీ రైతుల జాబితాను సిద్దంచేసి వారికి డీఆర్‌డీఏ ద్వారా పకృతి వ్యవసాయానికి తోడ్పాటు అందించే విదంగా చూడాలన్నారు. పకృతి వ్యవసాయానికి కావాల్సి న తోడ్పాడు నాబార్డ్ సంస్ధ ద్వారా అందించబడుతోందన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రాజెక్టు మేనేజర్ రామకృష్ణరాజు, సీనియర్ కన్సల్టేంట్ సురేంద్రారెడ్డి పాల్గొన్నారు.