సాంకేతికతపై అవగాహన పెంచుకోవాలి
ABN , First Publish Date - 2023-02-04T23:33:40+05:30 IST
ప్రభుత్వ కళాశాలల్లో అధ్యా పకులు సాంకేతికపై అవగాహన పెంచుకో వాలని ఉన్నత విద్యాశా ఖ ఆర్‌జేడీ డాక్టర్ బాబు ఆదేశించారు.
మదనపల్లె టౌన, ఫిబ్రవరి 4: ప్రభుత్వ కళాశాలల్లో అధ్యా పకులు సాంకేతికపై అవగాహన పెంచుకో వాలని ఉన్నత విద్యాశా ఖ ఆర్‌జేడీ డాక్టర్ బాబు ఆదేశించారు. శనివారం స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలను సందర్శించిన ఆర్‌జేడీ మాట్లాడుతూ ప్రతి కళాశాల న్యాక్ గుర్తింపు పొందాలన్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశా లలో అందుబాటులో వున్న సౌకర్యాలు, విద్యాబోధన, ఎస్‌ఎస్‌ఆర్ రిపోర్టులపై అధ్యాపకులు కలసి పనిచేయాలన్నారు. రెండు నెలల్లో న్యాక్ పీర్ కమిటీ సందర్శించే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కృష్ణవేణి, అధ్యాపకులు పాల్గొన్నారు.
అపరిచిత వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి
మదనపల్లె క్రైం, ఫిబ్రవరి 4: అపరిచిత వ్యక్తులతో విద్యార్థులు జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలని ఆర్డీవో మురళీ పేర్కొన్నారు. శనివారం స్థానిక జడ్పీహైస్కూల్లో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆర్డీవో మాట్లాడుతూ పరిచయం లేని వ్యక్తులతో విద్యార్థినులు మాట్లాడకూడ దన్నారు. ముఖ్యంగా ఎవరు పడితే వారితో స్నేహం చేయరాదన్నారు. ఆకతాయి, అల్లరిమూకలు వేధిస్తే వెంటనే తల్లిదండ్రులకు లేదా ఉపాధ్యాయులకు చెప్పాలన్నారు. మరీ ఎక్కువైతే పోలీసులకు ఫిర్యా దు చేయాలన్నారు.ఆకతాయిల ఆగడాలు, వేధింపులపై దృష్టి సారిం చాలని పోలీసులకు సూచించారు. డీవైఈవో కృష్ణప్ప, ఎంఈవో ప్రభా కర్‌రెడ్డి, హెచఎం రెడ్డెన్నశెట్టి, సీడీపీవో సుజాత, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.