అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండండి

ABN , First Publish Date - 2023-05-20T22:03:21+05:30 IST

అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండి పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేయాలని ఒంటిమిట్ట సీఐ పురుషో త్తంరాజు తెలియజేశారు.

అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండండి
అసాంఘిక కార్యకలాపాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న ఒంటిమిట్ట సీఐ

సిద్దవటం, మే 20 : అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండి పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేయాలని ఒంటిమిట్ట సీఐ పురుషో త్తంరాజు తెలియజేశారు. సిద్దవటం మండలం పెద్దపల్లె పంచాయతీ ఉపాధి కూలీలు శనివారం ఉపాధి పనులు నిర్వహిస్తుండగా ఒంటిమిట్ట సీఐ పురుషోత్తంరాజు పోలీసు సిబ్బందితో అక్కడికి వెళ్లి అవగాహన కల్పించారు. అనంతరం పెద్దపల్లె హరిజనవాడల్లో కూడా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారణాయుధాలు ఇంట్లో ఉంచుకోరాదన్నారు. గ్రా మంలో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనబడితే పోలీసులకు సమాచారం అందించా లన్నారు. ప్రతి ఒక్కరూ తమ పిల్లల చదువులపై దృష్టి సారించి వారికి మంచి భవి ష్యత్తును ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్‌ అసిస్టెంట్‌ పుల్లయ్య, సిద్దవటం పోలీసులు పాల్గొన్నారు.

Updated Date - 2023-05-20T22:03:21+05:30 IST