Viveka Murder Case.. నేడు సీబీఐ విచారణకు ఎంపీ అవినాష్ రెడ్డి.. వైసీపీలో టెన్షన్..

ABN , First Publish Date - 2023-01-28T12:02:42+05:30 IST

వివేకా హత్య కేసు (Viveka Murder Case)లో సీబీఐ (CBI) విచారణకు ఎంపీ అవినాష్‌రెడ్డి (MP Avinash Reddy) శనివారం మధ్యాహ్నం 3 గంటలకు కోటిలోని సీబీఐ కార్యాలయం (CBI Office)లో హాజరుకారుకానున్నారు.

Viveka Murder Case.. నేడు సీబీఐ విచారణకు ఎంపీ అవినాష్ రెడ్డి.. వైసీపీలో టెన్షన్..

హైదరాబాద్: వివేకా హత్య కేసు (Viveka Murder Case)లో సీబీఐ (CBI) విచారణకు ఎంపీ అవినాష్‌రెడ్డి (MP Avinash Reddy) శనివారం మధ్యాహ్నం 3 గంటలకు కోటిలోని సీబీఐ కార్యాలయం (CBI Office)లో హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ (YCP)లో టెన్షన్ (Tension) నెలకొంది. ఇదే మొదటిసారి కావడం.. ప్రశ్నిస్తున్నది కూడా ముఖ్యమంత్రి జగన్‌కు వరుసకు సోదరుడు అవినాష్ రెడ్డి కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నెల 24నే విచారణకు రావాలని అంతకుముందురోజు సీబీఐ అవినాష్ రెడ్డికి నోటీసులు ఇచ్చింది. అయితే ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాల కారణంగా ఐదు రోజుల తర్వాత విచారణకు రాగలనని ఎంపీ బదులిచ్చారు. దీంతో ఈ నెల 25న పులివెందులకు వచ్చిన సీబీఐ అధికారులు విచారణకు రావాలని మళ్లీ నోటీసు ఇచ్చారు. ఈ కేసులో అవినాష్ ప్రమేయంపై సీబీఐ పలు అనుమానాలు వ్యక్తం చేసింది. ఇవాళ అవినాష్‌ను అనుమానితుడిగానే ప్రశ్నించే అవకాశం ఉంది. అటు జగన్‌కు.. ఇటు భారతికి రెండు వైపుల నుంచి అవినాష్ రెడ్డి బంధువే. భారతి సొంత మేనమామ వైఎస్ భాస్కర్ రెడ్డి కొడుకే అవినాష్ రెడ్డి. రాజశేఖర్ రెడ్డి ఉన్నంతకాలం పులివెందులలో అవినాష్ రెడ్డి కుటుంబానికి ప్రాధాన్యం లేదు. వైఎస్ వివేకానందరెడ్డే జిల్లా రాజకీయాలు చూసుకునేవారు. పులివెందులలో కూడా అవినాష్ కుటుంబానికి రాజకీయంగా పెద్ద పరపతి ఉండేదికాదు. అప్పట్లో కేవలం మున్సిపల్ రాజకీయాలకే పరిమితమయ్యేవారు. వైఎస్ మరణానంతరం జగన్ హయాంలో అవినాష్ రెడ్డికి ప్రాధాన్యం పెరిగింది.

2019 మార్చి 15న వివేక పులివెందులలోని సొంత ఇంటిలోనే దారుణ హత్యకు గురయ్యారు. ఇది తెలిసి అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కరరెడ్డి, శంకర్ రెడ్డి బెడ్రూమ్, బాత్రూమ్‌లలో రక్తం మరకలను కడిగించేసి గుండెపోటుగా ప్రచారం చేశారు. వివేకా డ్రైవర్ దస్తగిరి అప్రూవర్‌గా మారి వివేకా హత్యకు సంబంధించి ప్రొద్దటూరు, పులివెందుల కోర్టుల్లో వాంగ్మూలం ఇచ్చారు. దీని ఆధారంగా దర్యాప్తు చేపట్టిన సీబీఐ వివేకా హత్య వెనుక ఎంపీ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, ఇంకా కొందరి ప్రమేయం ఉన్నట్లు అనుమానాలు ఉన్నాయంటూ సీబీఐ చార్జిషీటులో పొందుపరిచింది. వివేకా గుండెపోటుతో మరణించారని కట్టుకథ అల్లడం, సాక్ష్యాలను విధ్వంసం చేయడంలో అవినాష్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి.. 24 మంది నిందితుల దురుద్దేశం అర్ధమవుతోందంటూ సుప్రీంకోర్టుకు ఇచ్చిన నివేదికలో పేర్కొంది. కడప ఎంపీ టిక్కెట్ కోసమే తన చిన్నాన్న వివేకా హత్య జరిగిందని జగన్ సోదరి షర్మిల సీబీఐకు వాంగ్మూలం కూడా ఇచ్చినట్లు సమాచారం. అలాగే తన తండ్రి హత్యలో అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, మరికొందరి ప్రమేయంపై అనుమానం ఉందంటూ వివేకా కుమార్తె సునీత సుప్రీం కోర్టుకు తెలిపారు.

కాగా తెలుగురాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసు మూడేళ్ళలో ఎన్నో మలుపులు తిరుగుతూ వస్తోంది.. సిబిఐ విచారణ తుది దశలో కీలకమైందిగా భావించిన వివేకా కుమార్తె సునీత రెడ్డి ఈ కేసు ఏపిలో వుంటే న్యాయం జరగదని ఇతర రాష్ట్రాలకు హైదరాబాద్ కు బదిలీ చేయాలని సుప్రీమ్ కోర్టును ఆశ్రయించగా ఏపి ప్రభుత్వ పరిస్ధితులను కేసు పూర్వాపరాలు విన్న సుప్రీమ్ కోర్టు వైఎస్ వివేకాహత్య కేసును తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేశారు.. ఈమేరకు కడప సెషన్స్ కోర్టు నుండి వివేకాహత్యకు సంబందించిన మొత్తం ఫైల్స్ ను సిబిఐ బృందం హదరాబాద్ కు తరలించారు.. ఇక్కడికి సీన్ కట్ చేస్తే.. ఇప్పుడు సిబిఐ అధికారుల బృందం కడప ఎంపి అవినాష్ రెడ్డిపై దృష్టి సారించి విచారణకు దూకుడుపెంచారు.. అయితే గత ఏడాది కాలంగా ఎంపి అవినాష్ రెడ్డి అరెస్ట్ అవుతున్నాడని సోషల్ మీడియాలో హల్ చల్ చేశారు. ఇప్బుడు సిబిఐ ఎంపి అవినాష్‌కు నోటీసులిచ్చి విచారణకు హైదరాబాద్ కు రమ్మని సిబిఐ చెప్బడంతో విచారణ ఎలా సాగుతుంది.. ఎంపీ

పై ఎలాంటి ప్రశ్నలు సంధిస్తారు.. ఇక ఎంపి అవినాష్ అరెస్ట్ కురంగం సిద్దమా అని సిఎం జగన్ రెడ్డి సొంత ఇలాకా కడపజిలాలో వైసిపి నేతలు టెన్షన్ పడుతుండగా కడపజిల్లా ప్రజల్లో ఎపి సిబిఐ విచారణకు హాజరు కావడం పై ఇప్పుడు హాట్టాఫిగ్గా మారింది..

Updated Date - 2023-01-28T12:24:14+05:30 IST