లేఅవుట్ నిబంధనలకు పాతర
ABN , First Publish Date - 2023-01-31T23:18:13+05:30 IST
కొత్త జిల్లా ఏర్పాట్లలో భాగంగా రాయచోటి అన్నమయ్య జిల్లాగా ఏర్పడింది. దీంతో జాతీయ రహదారి ఆనుకుని ఉన్న వ్యవసాయ భూములకు మంచి ధరలు పలికాయి.
కోట్లలో చేతులు మారిన వైనం
పంచాయతీ ఆదాయానికి గండి
కొనుగోలు దారులకు భవిష్యత్తులో తప్పని తిప్పలు
సంబేపల్లె, జనవరి31: కొత్త జిల్లా ఏర్పాట్లలో భాగంగా రాయచోటి అన్నమయ్య జిల్లాగా ఏర్పడింది. దీంతో జాతీయ రహదారి ఆనుకుని ఉన్న వ్యవసాయ భూములకు మంచి ధరలు పలికాయి. వ్యాపారులు వ్యవసాయ భూములను ప్లాట్లు వేసి లేఅవుట్ వేశారు. నిబంధనలకు పాతర వేస్తూ ప్లాట్లు వేసి అమ్మేశారు. కోట్ల రూపాయలు చేతులు మా రిపోయాయి. సంబేపల్లె మండలం మో టకట్ల గ్రామం జాతీయ రహదారి ఆను కుని 25 ఎకరాల్లో పెద్ద లే అవుట్ వేసి కోట్లు సొమ్ము చేసుకున్న వైనం మండలంలో చోటు చేసుకుంది. నిబంధనలకు తిలోద కాలు ఇచ్చి పంచాయతీ అనుమతులు లేకుండా ప్లాట్లు వేయడంతో కొనుగోలు దారులు భవిష్యత్తులో సమస్యలు ఎదుర్కోక తప్పదంటున్నారు.
వ్యవసాయ భూముల్లో లేఅవుట్ నిబంధనలు
వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చాలి. ల్యాండ్ కన్వర్షన్ కింద అధికారులకు దరఖాస్తు చేయాలి. ల్యాండ్ కన్వర్షన్ అనుమతులతో పంచాయతీ అ ప్రూవల్ ఉండాలి. 10 శాతం భూ మిని పంచాయతీకి అప్పగిస్తూ బడి, గుడి, క్రీడా ప్రాంగణాలకు స్థలం కేటాయించాలి. విశాలమైన వీధులు, డ్రైనేజీ నిర్మాణాలకు వీలుగా ఉండా లి. విద్యుత్ సౌకర్యం కోసం పంచాయతీ సెక్రటరీల అనుమతి తీసుకోవాలి. తర్వాత ప్లాట్లు వేసి అమ్మకా లు చేపట్టాలి. అయితే మన వ్యాపారులు సంబేపల్లె మండలం మోటకట్ల రెవెన్యూ ప్రకాశ్ నగర్‌కాలనీ సమీపంలో సర్వే నెంబరు 834, 835/2, 834/3, 835/5, 773/2, 773/3, 773/5లో నిబందనలకు పాత్ర వేస్తూ 25 ఎకరాల్లో ప్లాట్లు వేశారు. ఒక్కో ప్లాట్ ఐదు సరాలు చొప్పున లక్షల్లో అమ్మకాలు జరిగాయి.
అనుమతులు తీసుకోలేదు
పంచాయతీ అనుమతులు తప్పనిసరిగా తీసుకోవా లి. ఇప్పటి వరకు సంబంధించి తీసుకోలేదు. పంచాయతీకి కట్టాల్సిన రాయల్టీ కట్టలేదు. ప్లాట్లు కొన్న లబ్ధిదారులు గృహ నిర్మాణాలు చేపట్టే సమయంలో వారికి అనుమతులు ఇవ్వడం కుదరదు.
రవీంద్ర, పంచాయతీ సెక్రటరీ
అక్రమ లేఅవుట్‌పై చర్యలు తీసుకోండి
గ్రామాల్లో సమస్యలు ఉన్నాయి. ప్రజా సమస్యలు తీర్చేందుకు పంచాయతీలో డబ్బుల్లేవు. లేఅవుట్ వేసిన వారు పంచాయతీ కట్టాల్సిన రాయల్టీ కట్టకుండా గండి కొట్టారు. అక్రమ లేఅవుట్లపై చర్యలు తీసుకోవాలి.
వాసుదేవరెడ్డి, మినమరెడ్డిగారిపల్లె