సమాచార సభగా.. సామాజిక వేదిక

ABN , First Publish Date - 2023-03-25T23:12:22+05:30 IST

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ప్రతి ఏటా నిర్వహించే సామాజిక తనిఖీ ప్రజావేదిక(ఓపెన ఫోరం) కేవలం సమాచార సభగా ముగిసింది.

సమాచార సభగా.. సామాజిక వేదిక
బ్యానర్‌ ఏర్పాటు చేయకుండానే నిర్వహిస్తున్న సామాజిక తనిఖీ బహిరంగ సభ

రూ.9 కోట్ల పనుల్లో రూ.30వేల రికవరీ కేవలం ఉపాధి ఉద్యోగులు, కొందరి నేతలతో మమ అనిపించిన వైనం

పీలేరు, మార్చి 25: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ప్రతి ఏటా నిర్వహించే సామాజిక తనిఖీ ప్రజావేదిక(ఓపెన ఫోరం) కేవలం సమాచార సభగా ముగిసింది. మామూలుగా సామాజిక తనిఖీ ప్రజావేదికలో నిర్దేశిత ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన పనులు, ఖర్చు చేసిన నిధులు, కూలీలకు కల్పించిన పనిదినాల లెక్కలను ప్రజల ముందు ఉంచి వారి నుంచి ఏమైనా అభ్యంతరాలు ఉంటే స్వీకరించి వాటిని పరిష్కరించడం పరిపాటి. అయితే పీలేరు సీఎల్‌ఆర్‌సీ భవ నంలో శనివారం జరిగిన సామాజిక తనిఖీ ప్రజావేదిక అందుకు భిన్నం గా సాగింది. పనుల పరిశీలనలా కాకుండా కేవలం పనుల గురించి సమాచారం అందించేలా జరిగింది. ఈ ప్రజావేదికను శనివారం ఏర్పా టు చేసినట్లు పెద్దగా ఎక్కడా ప్రచారం చేయకపోవడంతో సభకు కేవ లం ఉపాధి హామీ సిబ్బంది, కొంత మంది అధికార పార్టీ నేతలు మాత్రమే హాజరయ్యారు. వారితోనే సభను తూతూ మంత్రంగా ము గించారు. సభ ప్రారంభమైన చాలా సేపటి వరకు కనీసం అక్కడ దాని కి సంబంధించిన బ్యానర్‌ కూడా లేకపోవడంతో కొంత మంది అధికా రులు గుర్తించి సిబ్బందిని మందలించడంతో హడావిడిగా దానిని ఏర్పాటు చేశారు.

1612 పనులు, రూ.9 కోట్లు ఖర్చు, రూ.30 వేలు రికవరీ

పీలేరు మండలంలోని 15 పంచాయతీలలో 2021-22 ఆర్థిక సంవత్స రంలో రూ.9.18 కోట్లతో 1612 పనులు చేపట్టినట్లు అధికారులు సామా జిక తనిఖీ ప్రజావేదికలో తెలిపారు. ఇందులో కూలీల వేతనాల కోసం రూ.5.87 కోట్లు, మెటీరియల్‌ కోసం రూ.3.31 కోట్లు ఖర్చు చేసినట్లు ఉపాధి హామీ పథకం అప్పటి ఏపీవో శ్రీనివాసులు అధికారుల దృష్టికి తెచ్చారు. వాటన్నింటినీ పరిశీలించిన అధికారులు చాలా చోట్ల అవెన్యూ ప్లాంటేషన్లలో నాటిన చెట్లు ఎండిపోయాయని, వాటి స్థానంలో కొత్త వాటిని నాటాలని ఆదేశించారు. అవెన్యూ ప్లాంటేషన్లలో నిర్లక్ష్యంగా వ్యవ హరించినందుకు రేగళ్లు, ముడుపులవేముల, గూడరేవుపల్లె, మేళ్లచెరువు, బాలంవారిపల్లె, తలపుల పంచాయతీల ఫీల్డ్‌, టెక్నికల్‌ అసిస్టెంట్లుకు రూ.7 వేల జరిమానా విధించారు. మొత్తం పనుల్లో రూ.30 వేల రికవ రీకి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏపీడీలు రవికుమార్‌, మధుబాబు, ఎస్‌ఆర్‌పీ సూర్యచక్ర, జూనియర్‌ క్వాలిటీ కంట్రోల్‌ అధికారిణి సుశీల, డీబీవో ప్రకాశ, ఎంపీపీ కంభం సతీశ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-25T23:12:22+05:30 IST