అంగన్వాడీ కార్యకర్తల అరెస్టు దారుణం

ABN , First Publish Date - 2023-09-25T23:03:03+05:30 IST

అంగన్వాడీ కార్యకర్తలను అక్ర మంగా అరెస్టు చేయడం దారు ణమని జిల్లా సీఐటీయూ అధ్య క్షుడు సీహెచ్‌ చంద్రశేఖర్‌ విమ ర్శించారు.

అంగన్వాడీ కార్యకర్తల అరెస్టు దారుణం
రైల్వేకోడూరులో రాస్తారోకో నిర్వహిస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు, సీఐటీయూ నాయకులు

రైల్వేకోడూరు, సెప్టెంబరు 25: అంగన్వాడీ కార్యకర్తలను అక్ర మంగా అరెస్టు చేయడం దారు ణమని జిల్లా సీఐటీయూ అధ్య క్షుడు సీహెచ్‌ చంద్రశేఖర్‌ విమ ర్శించారు. సోమవారం రైల్వే కోడూరులో సీఐటీయూ ఆధ్వ ర్యంలో రాస్తారోకో నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యలు పరి ష్కరించాలని విజయవాడలోని ధర్నా చౌక్‌లో ఆందోళన చేసేందుకు వెళుతున్న కార్యకర్తలను, నాయకులను ముందస్తుగా అరెస్టు చేశారన్నారు. పోలీసులను ఉపయోగించుకుని ప్రభుత్వం అరెస్టులు చేయించిందన్నారు. ముందస్తుగా నోటీసులు ఇవ్వడం, గృహ నిర్బంధం చేయడం దారుణమని తెలిపారు. ఇలాంటి పరిస్థితులు ఎక్కడా చూడలేదన్నారు. ముఖ్యమంత్రి జగన్‌ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నా రు. అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరన్నారు. బ్రిటిష్‌ ప్రభుత్వం కంటే దారుణంగా వైసీపీ ప్రభుత్వం తయారైందన్నారు. అంగన్వాడీలకు కనీస వేతనాలు రూ. 26 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సుప్రీం కోర్డు ఆదేశానుసారంగా గ్రాట్యుటీ అమలు చేయాలన్నారు. పెన్షన్‌ సౌకర్యం కల్పించాలన్నారు. ఫేస్‌ యాప్‌ రద్దు చేయాలన్నారు. ఆరేళ్ల నుంచి బకాయి పడ్డ టీఏ, డీఏలు చెల్లించాలన్నారు. రాస్తారోకో చేస్తున్న వారిని పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నాయకురాళ్లు జి. పద్మావతి, వెన్నెల, దుర్గా, ఈశ్వరమ్మ, కుమారి, మాధవి, రోజా, ముణెమ్మ, రెడ్డమ్మ, సునీత, నిర్మల, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-25T23:03:03+05:30 IST