నేడు ఏపీపీఎస్సీ గ్రూప్-4 పరీక్షలు
ABN , First Publish Date - 2023-04-03T23:38:13+05:30 IST
ఏపీపీఎస్సీ గ్రూప్-4 పరీక్షలను విజయవంతం చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్ గౌడ్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్ గౌడ్
కడప(కలెక్టరేట్), ఏప్రిల్ 3: ఏపీపీఎస్సీ గ్రూప్-4 పరీక్షలను విజయవంతం చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్ గౌడ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈనెల 4వ తేదీ మంగళవారం నిర్వహిస్తున్న ఏపీపీఎస్సీ గ్రూపు-4 పరీక్షల ఏర్పాట్లపై సోమవారం కలెక్టరేట్‌లోని జిల్లా రెవెన్యూ అధికారి చాంబరులో సంబంధిత అధికారులతో డీఆర్వో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ జిల్లాలో ఏపీపీఎస్సీ గ్రూపు-4 పరీక్షలు రెండు సెషన్స (ఉద యం, మధ్యాహ్నం)లలో నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ పరీక్షలు ఉదయం 9-30గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 2-30 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి గంట ముందుగానే హాజరు కావాలన్నారు. ఈ పరీక్షలకు జిల్లాలో 5 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సికెదిన్నె మండలంలోని ఊటుకూరు వద్ద గల అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స, అదే మండలంలోని తాడిగొట్ల గ్రామ పరిధిలోని వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సు అండ్ టెక్నాలజీ కళాశాల, సికెదిన్నె మండలంలోని తాడిగొట్ల గ్రామ పరిధిలోని కందుల ఓబుల్‌రెడ్డి మెమోరియల్ కళాశాల ఆఫ్ ఇంజనీరింగ్, ప్రొద్దుటూరు మం డలంలోని తాళ్లమాపురం రోడ్డు సమీపంలోని సాయి రాజేశ్వరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలతో పాటు చాపాడు మండలంలోని విద్యానగర్, పల్లవోలు గ్రామంలోని చైతన్యభారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో గ్రూపు- 4 పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. ఈ పరీక్షలకు ఉదయం 863 మంది, మధ్యాహ్నం 863 మంది మొత్తం 1726 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని డీఆర్వో పేర్కొన్నారు. పరీక్షల నిర్వాహకులు ఎటువంటి లోటు పాట్లు లేకుండా ప్రణాళికాబద్దంగా అప్రమత్తతో పరీక్షలు నిర్వహించాలన్నారు. పరీక్షా కేంద్రానికి ఎలకా్ట్రనిక్ పరికరాలకు తీసు కురాకూడదన్నారు. ముఖ్యంగా ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, 108 వాహనం ఏర్పాటు, ఆర్టీసి బస్సులు ఏర్పాటు తదితరాలపై సంబంధితశాఖల అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో కలెక్టరేట్ పరిపాలనాధికారి విజయకుమార్, ఏపీపీఎస్సీ సెక్షన ఆఫీసరు సాయి ప్రకా్‌ష, అసిస్టెంట్ సెక్షన ఆఫీసరు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.