ఎన్నికల రిటర్నింగ్‌ అధికారుల నియామకం

ABN , First Publish Date - 2023-08-02T23:38:16+05:30 IST

రానున్న సాధారణ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఆయా శాసనసభ నియోజకవర్గాలకు ఎన్నికల అధికారుల (రిటర్నింగ్‌ ఆఫీసర్సు)ను నియమిస్తూ ఎన్నికల కమిషన్‌ బుధవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. కడప, అన్నమయ్య జిల్లాల్లోని కడప, రాజంపేట పార్లమెంట్‌ నియోజకవర్గాల పరిధిలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల కు ఎన్నికల అధికారులను నియమించారు.

ఎన్నికల రిటర్నింగ్‌ అధికారుల నియామకం

నోటిఫికేషన్‌ జారీ చేసిన ఎన్నికల కమిషన్‌

కలికిరి, ఆగస్టు 2: రానున్న సాధారణ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఆయా శాసనసభ నియోజకవర్గాలకు ఎన్నికల అధికారుల (రిటర్నింగ్‌ ఆఫీసర్సు)ను నియమిస్తూ ఎన్నికల కమిషన్‌ బుధవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. కడప, అన్నమయ్య జిల్లాల్లోని కడప, రాజంపేట పార్లమెంట్‌ నియోజకవర్గాల పరిధిలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల కు ఎన్నికల అధికారులను నియమించారు. వీరితో పాటు 14 శాసనసభ నియోజకవర్గాలకు సహాయ ఎన్నికల అధికారులను, ఎలక్ర్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారులను భారత ఎన్నికల సంఘం ముఖ్య కార్యదర్శి అవినాశ్‌కుమార్‌ ఆదేశాల మేరకు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (సీఈఓ) ముఖే్‌షకుమార్‌ మీనా బుధవారం నోటిఫికేషన్‌ జారీ చేశారు.

అసెంబ్లీ రిటర్నింగ్‌ ఆఫీసర్లు

కడప, రాజంపేట పార్లమెంట్‌ నియోజకవర్గాల పరిధిలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల కు రిటర్నింగ్‌ అధికారుల వివరాలిలా ఉన్నాయి. కడప పార్లమెంట్‌ పరిధి బద్వేలు నియోజకవర్గానికి బద్వేలు ఆర్డీఓ, కడపకు ఆర్డీఓ కడప, పులివెందులకు ఆర్డీఓ పులివెందుల, కమలాపురానికి కడప జాయింట్‌ కలెక్టరు, జమ్మలమడుగుకు ఆర్డీఓ జమ్మలమడుగు, ప్రొద్దుటూరుకు స్పెషల్‌ కలెక్టర్‌, జీఎన్‌ఎ్‌సఎ్‌స కడప, మైదుకూరుకు స్పెషల్‌ డి ప్యూటీ కలెక్టర్‌ (భూసేకరణ), టీజీపీ యూనిట్‌-2 కడపను నియమించారు. అదేవిధంగా రాజంపేట పార్లమెంట్‌ పరిధిలోని రాజంపేటకు ఆర్డీఓ రాజంపేట, కోడూరుకు స్పెషల్‌ డిప్యూటీ కలెక్టరు, ఎస్‌ఎ్‌సపీ యూనిట్‌-4 రాజంపేట, రాయచోటికి ఆర్డీఓ రాయచోటి, తంబళ్లపల్లెకు స్పెషల్‌ డిప్యూటీ కలెక్టరు, హెచ్‌ఎన్‌ఎ్‌సఎ్‌స, యూనిట్‌-1 మదనపల్లె, పీలేరుకు జాయింట్‌ కలెక్టరు, మదనపల్లెకు ఆర్డీఓ మదనపల్లె, పుంగనూరుకు చిత్తూరు కలెక్టరు కార్యాలయంలోని కేఆర్‌ఆర్‌సీ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టరు.

సహాయ ఎన్నికల అధికారులు

సహాయ ఎన్నికల అధికారులుగా బద్వేలుకు ఏడుగురు తహసీల్దార్లను, కడపకు కడప అర్బన్‌, రూరల్‌ తహసీల్దార్లు సహా కడప మున్సిపల్‌ కార్పొరేషన్‌ అదనపు కమిషనరు, పులివెందులకు దీని పరిధిలోని ఏడుగురు తహసీల్దార్లను, కమలాపురానికి ఆరుగురు తహసీల్దార్లను, జమ్మలమడుగుకు ఆరుగురు తహసీల్దార్లను, ప్రొద్దుటూరుకు ప్రొద్దుటూరు, రాజుపాలెం తహసీల్దార్లను, మైదుకూరుకు ఐదుగురు తహసీల్దార్లను నియమించారు. రాజంపేట పార్లమెంట్‌ పరిధిలోని రాజంపేటకు రాజంపేట, నందలూరు, సుండుపల్లె, వీరబల్లి, కడప జిల్లాలోని సిద్దవటం, ఒంటిమిట్ట, తహసీల్దార్లను, కోడూరుకు ఐదుగురు తహసీల్దార్లను, రాయచోటికి దీని పరిధిలోని ఆరుగురు తహసీల్దార్లను, తంబళ్లపల్లెకు ఆరుగురు తహసీల్దార్లను, పీలేరుకు ఆరుగురు తహసీల్దార్లను, మదనపల్లెకు మదనపల్లె, నిమ్మనపల్లె, రామసముద్రం తహసీల్దార్లు సహా మదనపల్లె మున్సిపల్‌ కమిషనరు, పుంగనూరుకు ఆరుగురు తహసీల్దార్లు, పుంగనూరు మున్సిపల్‌ కమిషనరును సహాయ ఎన్నికల అధికారులుగా నియమించారు.

ఎలక్ర్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారులు

ఎలకో్ట్రరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారులుగా బద్వేలుకు ఆర్డీఓ బద్వేలు, కడపకు ఆర్డీఓ కడప, పులివెందులకు ఆర్డీఓ పులివెందుల, కమలాపురానికి టీజీపీ (భూసేకరణ) యూనిట్‌-2 కడప స్పెషల్‌ డిప్యూటీ కలెక్టరు, జమ్మలమడుగుకు ఆర్డీఓ జమ్మలమడుగు, ప్రొద్దుటూరుకు జీఎన్‌ఎ్‌సఎ్‌స (భూసేకరణ) కడప స్పెషల్‌ కలెక్టరు, మైదుకూరుకు జీఎన్‌ఎ్‌సఎ్‌స (భూసేకరణ) యూనిట్‌-2 కడప స్పెషల్‌ కలెక్టరును నియమించారు. రాజంపేట పార్లమెంట్‌ పరిధిలోని రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గానికి ఆర్డీఓ/సబ్‌ కలెక్టరు రాజంపే ట, కోడూరుకు రాజంపేట ఎస్‌ఎ్‌సపీ యూనిట్‌-4 స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ను, రాయచోటికి ఆర్డీఓ/సబ్‌కలెక్టర్‌, రాయచోటి, తంబళ్లపల్లెకు హెచ్‌ఎన్‌ఎ్‌సఎ్‌స యూనిట్‌-1 మదనపల్లె స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ (భూసేకరణ), పీలేరుకు హెచ్‌ఎన్‌ఎ్‌సఎ్‌స యూనిట్‌-2 పీలేరు స్పెషల్‌ డిప్యూటీ కలెక్టరు (భూసేకరణ), మదనపల్లెకు ఆర్డీఓ/సబ్‌ కలెక్టర్‌ మదనపల్లె, పుంగనూరుకు చిత్తూరు జడ్పీ సీఈఓను నియమించారు.

Updated Date - 2023-08-02T23:38:16+05:30 IST