మరో చీటీ వ్యాపారి పరారీ
ABN , First Publish Date - 2023-06-26T23:48:53+05:30 IST
మండల కేంద్రమైన కలసపాడుకు చెందిన ఓ చీటీల వ్యాపారి పరారీ అయినట్లు బాధితులు జిల్లా కలెక్టరు విజ యరామరాజు, ఎస్పీ అన్బురాజనకు ఫిర్యాదు చేశారు.
కలెక్టర్, ఎస్పీలకు బాధితుల ఫిర్యాదు
కలసపాడు, జూన్ 26: మండల కేంద్రమైన కలసపాడుకు చెందిన ఓ చీటీల వ్యాపారి పరారీ అయినట్లు బాధితులు జిల్లా కలెక్టరు విజ యరామరాజు, ఎస్పీ అన్బురాజనకు ఫిర్యాదు చేశారు. సోమవారం కడపలో కలెక్టర్, ఎస్పీలు నిర్వహించిన స్పందన కార్యక్రమంలో బాధి తులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. కలసపాడుకు చెందిన రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు ప్రభాకర్‌రావు చీటీలు వేసేవార న్నారు. ఎంతో నమ్మకంగా ఉండటంతో చీటీలు వేయడంతో పాటు అప్పులు కూడా ఇచ్చామని తెలిపారు. దాదాపు రూ.4కోట్ల మేర చీటీలు, అప్పుల రూపంలో తీసుకుని పరారీ అయ్యారని బాధితులు వాపోయారు. ఆస్తులను జప్తు చేసి తమకు న్యాయం చేయాలని వారు కోరారు.