వైభవంగా మహా శివుడికి అన్నాభిషేకం

ABN , First Publish Date - 2023-08-16T23:21:54+05:30 IST

వాల్మీకిపురం పట్టణ పడమర పొలిమేరల్లోని ధర్మపథం సమూహాల యంలో బుధవారం షిరిడీసాయి సాలిగ్రామ తిరునారాయణ ఽధార్మిక సేవా ట్రస్టు ఆధ్వర్యంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

వైభవంగా మహా శివుడికి అన్నాభిషేకం
ధర్మపథంలో అన్నాభిషేకం నిర్వహిస్తున్న అర్చకులు

అధిక శ్రావణ అమావాస్య పూజలు

పోటెత్తిన భక్తులు

వాల్మీకిపురం, ఆగస్టు 16: వాల్మీకిపురం పట్టణ పడమర పొలిమేరల్లోని ధర్మపథం సమూహాల యంలో బుధవారం షిరిడీసాయి సాలిగ్రామ తిరునారాయణ ఽధార్మిక సేవా ట్రస్టు ఆధ్వర్యంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉద యం ఆలయంలోని లింగోద్భవ మహాశివుడికి అభిషేకం, అర్చన, మహా అన్నాభిషేకం గావించి ప్రత్యేక అలంకరణలతో పూజలు జరిగాయి. ఈసందర్భంగా ధర్మపథం ఆలయంలో శివనామ స్మరణ మార్మోగింది. హోమాధి కార్యక్రమాల అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాల పంపిణీ, అన్నదానం చేపట్టారు. కార్యక్రమంలో ట్రస్టు వ్యవస్థాపకులు, అర్చకులు సాలిగ్రామ శ్రీనివాసాచార్యులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

శివాలయంలో అమావాస్య పూజలు

పెద్దతిప్పసముద్రం ఆగస్టు 16: పార్వతీ సమేత విరూపాక్షేశ్వరస్వామి ఆలయంలో బుధవారం అధిక శ్రావణమాసం అమావాస్య సందర్భంగా ఆధ్యాత్మిక వేత్త సనగరం పట్టాభిరామయ్య అధ్వర్యంలో లక్ష్మిఅమ్మ వారికి విశేష పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం అమ్మ వారికి అభిషేకపూజలు, కలశస్థాపన, గణపతిహోమం, పంచామృతాభిషేకం, లక్ష్మీకుబేర పాశుపతహోమం, పుర్ణాహుతి నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులకు తీర్థప్రసాదాలతో పాటు అన్నదానం నిర్వహించారు. ఈపూజా కార్యక్రమాలకు పీటీఎంతో పాటు సమీప గ్రామాఅల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Updated Date - 2023-08-16T23:21:54+05:30 IST