ఏపీలో అప్రకటిత ఎమర్జెన్సీ
ABN , First Publish Date - 2023-06-26T01:05:04+05:30 IST
భారతదేశంలో 1975 జూన్ 25న ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ప్రకటించి రెండేళ్లపాటు ప్రజాస్వామ్య వ్యవస్థకు సంకెళ్లు వేసి చీకటి రోజులను మిగిల్చితే.. ఆంధ్రప్రదేశ్‌లో నేడు జగన్ ప్రభుత్వం నాలుగేళ్లుగా అప్రటిత ఎమర్జెన్సీ నడుపుతోందని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ విమర్శించారు.
దోపీడీ దందాల్లో పోటీపడుతున్న వైసీపీ ఎమ్మెల్యేలు
బీజేపీ బహిరంగ సభలో జాతీయ కార్యదర్శి సత్యకుమార్
ప్రొద్దుటూరు అర్బన్, జూన్ 25: భారతదేశంలో 1975 జూన్ 25న ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ప్రకటించి రెండేళ్లపాటు ప్రజాస్వామ్య వ్యవస్థకు సంకెళ్లు వేసి చీకటి రోజులను మిగిల్చితే.. ఆంధ్రప్రదేశ్‌లో నేడు జగన్ ప్రభుత్వం నాలుగేళ్లుగా అప్రటిత ఎమర్జెన్సీ నడుపుతోందని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ విమర్శించారు. ఆదివారం నరేంద్రమోదీ నేతృత్వంలోని బీజేపీ పాలన 9 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లాస్థాయి బహిరంగ సభను స్థానిక అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూలు ఆవరణలో నిర్వహించారు. ఈసభలో సత్యకుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో 306 సంక్షేమ పథకాలు కేంద్ర ప్రభుత్వం అందిస్తుంటే ఒక్క పథకానికి కూడా నరేంద్రమోదీ బొమ్మ లేదన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు ఇచ్చి న హమీలను ఏవీ నేరవేర్చకుండానే అబద్దాలతో ప్రభుత్వాన్ని నడుపుతున్నాడన్నారు. చెల్లికి మళ్లీపెళ్లంటూ స్ట్టీల్‌ప్లాంటుకు మళ్లీ మళ్లీ శంకుస్థాపనలు చేశాడన్నారు. జాబ్ క్యాలెండర్ లేదని.. రూ.60వేల కోట్ల నీటి ప్రాజెక్టులు ఎక్కడ నిర్మించారని.. రాయలసీమకు గుండ్రేవుల, సిద్ధేశ్వరం ప్రాజెక్టులు ఏమయ్యాయని ప్రశ్నించారు. అత్తారింటికి దారేది సినిమాలో లాగా బ్రహానందం కామిడీని జగన్ పాలన తలిపిస్తోందన్నారు. జగన్ పచ్చని చెట్టు కింద మాట్లాడితే చెట్ల ఆకులన్నీ రాలిపోతాయని ఎద్దేవా చేశారు. మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ అంతులేని వివేకానంద హత్య కేసు కఽథ జులై 3న సుప్రీం కోర్టులో జస్టిస్ చంద్రచూడ్ తీర్పుతో అంతం కాబోతుందన్నారు. ఇప్పటివరకు పోయిన వైఎ్‌సలు కాకుండా ఇంకా చాలా మంది వైఎ్‌సలు చంచల్‌గూడకు వెళతారన్నారు. రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ మాట్లాడుతూ జగన్ పాలనలో వైసీపీ ఎమ్మెల్యేలు రాష్ట్రంలో అక్రమ సంపాదన, దోపిడీలో పోటీ పడుతున్నారన్నారు. దేశంలో నిషేధించబడ్డ గుట్కా వ్యాపారం ఏపీలోనే జరుగుతోందన్నారు. ప్రొద్దుటూరులో గుట్కా, మట్కా, క్రికెట్ బెట్టింగ్‌లలో ఎమ్మె ల్యే రాచమల్లు ఆయన బావమరిది బంగారు రెడ్డికి లక్షల్లో మాముళ్లు అందుతున్నాయన్నారు. ప్రొద్దుటూరులో ఎవ్వరైనా హాస్పిటల్స్, కమర్షిల్ భవనాలు, అపార్ట్‌మెంట్లు కట్టుకో వాలన్నా బావమరిది బంగారురెడ్డికి కప్పం కట్టాల్సిందే అని ఆరోపించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్రా శివనారాయణ, జిల్లా అధ్యక్షుడు ఎల్లారెడ్డి, ప్రొద్దుటూరు అసెంబ్లీ కన్వీనర్ గొర్రె శ్రీనివాసులు, జిల్లా కన్వీనర్ బాలక్రిష్ణ యాదవ్, జిల్లా ఇన్‌చార్జ్ వెంకటేశ్వరరెడి,్డ కడప కన్వీనర్ లక్ష్మీనారాయణ రెడ్డి, మైదుకూరు కన్వీనర్ మాచనూరు సుబ్బరాయుడు, బీజేపీ పట్టణ అఽధ్యక్షుడు సుబ్రహ్మణ్యం, బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి కోనేటి ప్రదీప్ రెడ్డి, భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.