రెచ్చగొట్టే ప్రకటనలకు అడ్మిన్‌లే బాధ్యులు: ఏఎస్పీ ప్రేర్ణకుమార్‌

ABN , First Publish Date - 2023-01-25T23:51:30+05:30 IST

రెచ్చగొట్టే ప్రకటనలు వాట్సప్‌ గ్రూపులలో పోస్టు చేస్తే అందుకు అడ్మిన్‌లే బాధ్యులు అవుతారని ప్రొద్దుటూరు అడిషనల్‌ ఎస్పీ ప్రేర్ణకుమార్‌ పేర్కొన్నారు.

రెచ్చగొట్టే ప్రకటనలకు అడ్మిన్‌లే బాధ్యులు: ఏఎస్పీ ప్రేర్ణకుమార్‌

ప్రొద్దుటూరు జనవరి25: రెచ్చగొట్టే ప్రకటనలు వాట్సప్‌ గ్రూపులలో పోస్టు చేస్తే అందుకు అడ్మిన్‌లే బాధ్యులు అవుతారని ప్రొద్దుటూరు అడిషనల్‌ ఎస్పీ ప్రేర్ణకుమార్‌ పేర్కొన్నారు. పట్టణంలోని యూట్యుబ్‌ ఛానల్స్‌కు సంబంధించిన ప్రతినిధులతో బుధవారం ఆమె సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూవాట్సప్‌ గ్రూపుల్లో ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెట్టకుండా గ్రూప్‌ అడ్మిన్‌లు బాధ్యత తీసుకోవాలన్నారు. గ్రూపుల్లో అడ్మిన్‌లు మాత్రమే వివరాలు పోస్టు చేయాలని సూచించారు. కొంత మంది మీడియా పేరుతో ఒక బ్యాచ్‌గా తయారై బెదిరింపులకు దిగుతున్నట్లు తమకు సమాచారం వచ్చిందన్నారు. అలాంటి వారిపై ఆధారాలతో సమాచారం ఇస్తే కేసు నమోదు చేస్తామన్నారు. కొంత మంది యూట్యూబర్స్‌ ఎడిట్‌ చేయకుండా వివాదాస్పద వ్యాఖ్యలు పెడుతున్నారన్నారు. ఇది సరికాదని ఆ విధంగా చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-25T23:51:52+05:30 IST