బిందు సేద్య పరికరాలకు పరిపాలన ఉత్తర్వులు

ABN , First Publish Date - 2023-08-02T00:05:13+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ సూక్ష్మనీటి సాగు పఽథకం ద్వారా అర్హులైన రైతులందరికీ బిందు సేద్య పరికాలు అందించేందుకు జిల్లా కలెక్టర్‌ నుంచి పరిపాలనా ఉత్తర్వులు తీసుకున్నట్లు ఏపీఎంఐపీ పీడీ రవీంద్రనాధ్‌రెడ్డి పేర్కొన్నారు.

బిందు సేద్య పరికరాలకు పరిపాలన ఉత్తర్వులు

ఏపీఎంఐపీ పీడీ రవీంద్రనాధ్‌రెడ్డి

కడప(రూరల్‌) ఆగస్టు1: ఆంధ్రప్రదేశ్‌ సూక్ష్మనీటి సాగు పఽథకం ద్వారా అర్హులైన రైతులందరికీ బిందు సేద్య పరికాలు అందించేందుకు జిల్లా కలెక్టర్‌ నుంచి పరిపాలనా ఉత్తర్వులు తీసుకున్నట్లు ఏపీఎంఐపీ పీడీ రవీంద్రనాధ్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్‌ ఆవరణలోని ఆంధ్రప్రదేశ్‌ సూక్ష్మనీటి సాగు పథకం కార్యాలయంలో కంపెనీ జిల్లా ప్రతినిధులకు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 10500 హెక్టార్లు లక్ష్యం కాగా ఇప్పటి వరకు 2021 మంది రైతులకు సంబంధించి 2409 హెక్టార్లకు పరిపాలనా ఉత్తర్వులు పొందడం జరిగిందన్నారు. ఈ పక్రియ నిరంతరంగా కొనసాగుతుందని.. అవసరమున్న ప్రతి ఒక్క రైతు వారికి సంబంధించిన ఆర్‌బీకేలలో రిజిస్ట్రేషన్‌ పూర్తి చేసుకోవాలన్నారు. తద్వారా రైతులు త్వరగా పరికరాలు అందుకోగలుగుతారన్నారు. రైతులు ఎంపిక చేసుకున్న కంపెనీ వారు త్వరితగతిన సహకరించి రైతులకు పరికరాలు అందజేయాలన్నారు. కార్యక్రమంలో ఏపీఎంఐపీ ఏపీడీ మురళీమోహన్‌రెడ్డి, ఎంఐ ఇంజనీర్లు, కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - 2023-08-02T00:05:13+05:30 IST