నగదు వసూళ్లకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలి

ABN , First Publish Date - 2023-03-25T23:19:38+05:30 IST

మదనపల్లె జిల్లా ఆస్పత్రిలో నగదు వసూ ళ్లకు పాల్పడుతున్న వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సీపీఐ నాయకులు డి మాండ్‌ చేశారు.

నగదు వసూళ్లకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలి
జిల్లా ఆస్పత్రి ఎదుట నిరసన తెలియజేస్తున్న సీపీఐ నాయకులు

మదనపల్లె క్రైం, మార్చి 25: మదనపల్లె జిల్లా ఆస్పత్రిలో నగదు వసూ ళ్లకు పాల్పడుతున్న వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సీపీఐ నాయకులు డి మాండ్‌ చేశారు. శనివా రం ఆస్పత్రి మెడికల్‌ సూపరింటెండెంట్‌ చాంబ ర్‌ వద్ద ఆమేరకు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు తోపు కృష్ణప్ప మాట్లాడుతూ ఆస్పత్రిలో అన్ని సేవలకు గానూ రోగి సహాయకుల నుంచి భారీగా నగదు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యంగా మెటర్నిటీవార్డులో కాసులివ్వ కుంటే ఏ పనీ జరగడం లేదన్నారు. ఇటీవల ఆస్పత్రిలో ఓ గర్భిణీకి సిజేరియన చేసి డబ్బులు వసూలు చేసి వాటాలు పంచుకున్నారని విమర్శించారు. దీనిపై ఎమ్మెల్యే నవాజ్‌బాషా ఆస్పత్రికి వచ్చి విచారణ చేశారని చెప్పారు. అయితే రోజులు గడుస్తున్నా బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బాధ్యు లపై చర్యలు తీసుకోకంటే పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు మురళీ, రెడ్డెప్ప, దేవా, తిరుమలప్ప, రవి, చంద్రశేఖర్‌, నవీన, శోభ, అనసూయ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-25T23:19:38+05:30 IST