అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి
ABN , First Publish Date - 2023-06-26T23:10:01+05:30 IST
బ్రాండ్స్ పేరుతో అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ విభాగ్ కన్వీనరు కోడూరు మల్లిఖార్జున డిమాండ్ చేశారు.
కడప (ఎడ్యుకేషన్), జూన్ 26: బ్రాండ్స్ పేరుతో అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ విభాగ్ కన్వీనరు కోడూరు మల్లిఖార్జున డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ స్పందన హాలులో జాయింట్ కలెక్టర్ గణే్‌షకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో కార్పొరేట్ విద్యాసంస్థలు ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా బ్రాండ్ పేరుతో విద్యను వ్యాపారంగా మార్చుతున్నారన్నారు. వీటిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలన్నారు. సీబీఎ్‌సఈ సిలబస్ పేరుతో స్మార్ట్, టెక్నో, ఒలంపియాడ్, ఐపీఎల్ తదితర బ్రాండ్ల పేరుచెప్పి విద్యార్థుల తల్లిదండ్లును నిలువునా దోపిడీ చేస్తున్నారన్నారు. వీటిపై తక్షణం చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు ఆదిత్య, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.