చేతి వృత్తుల కళాకారులకు సన్మానం

ABN , First Publish Date - 2023-09-17T23:52:17+05:30 IST

ప్రధానమంత్రి నరేంద్రమోదీ 74వ జన్మదినం సందర్భంగా మండల పరిధిలోని పుత్తనవారిపల్లె కల్యాణ మండపంలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు సాయిలోకేష్‌ ఆదివారం చేతివృత్తుల కళా కారులను ఘనంగా సన్మానించారు.

చేతి వృత్తుల కళాకారులకు సన్మానం
రాజంపేటలో అన్నదానం చేస్తున్న బీజేపీ నాయకులు

పుల్లంపేట, సెప్టెంబరు 17: ప్రధానమంత్రి నరేంద్రమోదీ 74వ జన్మదినం సందర్భంగా మండల పరిధిలోని పుత్తనవారిపల్లె కల్యాణ మండపంలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు సాయిలోకేష్‌ ఆదివారం చేతివృత్తుల కళా కారులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ ప్రధానమంత్రి విశ్వకర్మ యోజనలో భాగంగా 17వేల కోట్లతో బృహత్తర పథకాన్ని నరేంద్ర మోదీ ప్రారంభించారన్నారు. ఇందులో భాగంగా చేతివృత్తుల కళాకారులకు శిక్షణ ఇచ్చి ఆర్ధికంగా ఎదిగేం దుకు రుణాలు ఇస్తారన్నారు. ప్రధానిని ప్రపంచ అగ్రగణ్య నేతలు మెచ్చుకొంటున్నారని కొనియాడారు. ఈ కార్యక్ర మంలో అసెంబ్లీ కన్వీనర్‌ చెంగల్‌రాజు, కిసాన్‌మోర్చా జిల్లా అధ్యక్షులు కంచాల శ్రీనివాసులు, జిల్లా ప్రధాన కార్యదర్శి సురేష్‌, సుబ్బన్న, షబ్బీర్‌ అహమ్మద్‌, సుబ్బ రాయుడు, ఆదినారాయణ, హరిప్రసాద్‌, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.

రాజంపేట రూరల్‌: రాజంపేట అసెంబ్లీ ఇన్‌చార్జి రమేష్‌ నాయుడు ఆదివారం పాతబస్టాండు కూడలిలో పేదలకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీ తన పదేళ్ల పదవీ కాలంలో దేశం ప్రపంచంలో గర్వపడేలా సంక్షేమ పథకాల అమలుతోపాటు, దేశ సమగ్రత, సార్వభౌమత్వాన్ని కాపాడరన్నారు. ఆదినారాయణ, ప్రభావతి, నాగరాజు, నగేష్‌ తదితరులు పాల్గొన్నారు.

సంబేపల్లె: నియోజకవర్గ బీజేప్లీ కన్వీనర్‌ అరమాటి శివగంగిరెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక పీఎన్‌కాలనీలో కేక్‌ కట్‌ చేశారు. ప్రకాశ్‌నగర్‌కాలనీ ప్రజలకు మట్టి వినా యక ప్రతిమలను పంపిణీ చేశారు. జయచంద్ర, రమేశ్‌ రెడ్డి, షకీల్‌, ఏస్సీ మోర్చా అసెంబ్లీ ఇన్‌చార్జి పెడబల్లి నాగ భూషణం, సుబ్బయ్యస్వామి, శ్రీకాంత్‌, శివ పాల్గొన్నారు.

నందలూరు: దుర్గాపురం ఎస్టీ కాలనీలో మిఠాయిలు పంచిపెట్టారు. పోతురాజు మస్తానయ్య, విఠల్‌ ఆచార్య, ఆదినారాయణ, శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

లక్కిరెడ్డిపల్లె: మండల బీజేపీ అద్యక్షుడు కొండూరు వెంకట రామరాజు, బాలాజి యాదవ్‌ ఆధ్వ్వర్యంలో కేక్‌ కట్‌ చేసి, వృద్దులకు పండ్లు పంపిణీ చేశారు. ఆంజనేయులు, హరిబాబు, జగదీశ్‌ , మహేష్‌, విష్ణు,పార్వతమ్మ వంకారప ురాములమ్మ తదితరులు పాల్గొన్నారు.

రైల్వేకోడూరు: నాయకులు, కార్యకర్తలు కేక్‌ కట్‌ చేసి అభిమానులకు పంచి పెట్టారు. రైల్వేకోడూరు బీజేపీ ఇన్‌ చార్జి గడ్డం చంగల్‌రాజు, రాజంపేట పార్ల మెంట్‌ ఉపాధ్య క్షుడు వాకచర్ల సుబ్బారావు, నాయకులు గడికోట సోమశేఖ ర్‌ చౌదరి, శంకర్‌రాజు, సాంబశివరావు, ఊటుకూరి చల పతి, బాపూజీ, నారాయణ, నాగరాజు పాల్గొన్నారు.

సుండుపల్లె:మండల బీజేపీ అధ్యక్షుడు రాచరాయుడు అధ్వర్యంలో నియోజకవర్గ అసెంబ్లీ కన్వీనర్‌ రామ జగదీశ్‌స్వామి, మండల అధ్యక్షుడు రాచరాయుడు, ప్రధాన కార్యదర్శి వెంకట్రమణనాయుడు, వెంకట్రామరాజు, ఉపాధ్యక్షుడు రెడ్డెయ్యఆచారి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-17T23:52:42+05:30 IST