Share News

మాండవ్య నదికి రక్షణ గోడ నిర్మించాలి

ABN , Publish Date - Dec 26 , 2023 | 11:16 PM

మాండవ్యనదికి రక్షణ గోడ నిర్మించా లని సీపీఐ (ఎంఎల్‌) లిబరేషన పార్టీ అన్నమయ్య జిల్లా నాయకులు మావు లూరి విశ్వనాఽథ్‌ ప్రభుత్వాన్ని డిమాం డ్‌ చేశారు.

మాండవ్య నదికి రక్షణ గోడ నిర్మించాలి
నిరసన వ్యక్తం చేస్తున్న సీపీఐ(ఎంఎల్‌) నేతలు

రాయచోటి టౌన, డిసెంబరు 26: మాండవ్యనదికి రక్షణ గోడ నిర్మించా లని సీపీఐ (ఎంఎల్‌) లిబరేషన పార్టీ అన్నమయ్య జిల్లా నాయకులు మావు లూరి విశ్వనాఽథ్‌ ప్రభుత్వాన్ని డిమాం డ్‌ చేశారు. మంగళవారం ఆయన సీపీఐ(ఎంఎల్‌) ఆధ్వ ర్యంలో పాత రాయచోటిలోని మాండవ్య నది ఒడ్డున గల వరద ప్రాంత ప్రజలతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మాండవ్యనది ఉప్పొంగి నప్పుడు నదికి ఇరువైపులా లోతట్టు ప్రాంతాల్లోని పేదలు సర్వం కోల్పోతున్నారన్నారు. ఈ విషయాన్ని అధికారులతో పాటు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ (ఎంఎల్‌) లిబరేషన పార్టీ నాయకులు పూసపాటి రమణ, వెంకటసుబ్బమ్మ, సుజాత, బాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 26 , 2023 | 11:16 PM