నీటి కుంటలో పడి వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2023-02-21T23:07:27+05:30 IST

కదిరి రోడ్డులోని నీటికుంటలో ప్రమాదవశాత్తు జారిపడి మధ్యప్రదేశ్‌ వాసి సంజయ్‌పాండే మృతిచెందారు.

నీటి కుంటలో పడి వ్యక్తి మృతి

పులివెందుల టౌన్‌, ఫిబ్రవరి 21: కదిరి రోడ్డులోని నీటికుంటలో ప్రమాదవశాత్తు జారిపడి మధ్యప్రదేశ్‌ వాసి సంజయ్‌పాండే మృతిచెందారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నా యి. సంజయ్‌పాండే ఉదయం నీటికుంటలో స్నానం చేయడానికి వెళ్లి ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడిపోయాడు. స్థానికుల సమాచారంపై ఎస్‌ఐ హుసేన్‌ ఆధ్వర్యంలో పోలీసులు, ఫైర్‌ సిబ్బంది నీటికుంటలో వ్యక్తి కోసం గాలించారు. చివరకు మైలవరం నుంచి గజ ఈతగాళ్లను రప్పించి వారితో గాలించగా మృతదేహం బయటపడింది.

Updated Date - 2023-02-21T23:07:28+05:30 IST