ఫాసిజానికి మాస్టర్‌ కాపీనే

ABN , First Publish Date - 2023-05-26T23:16:09+05:30 IST

దేశంలో లౌకి క ప్రజాస్వామ్య వ్యవస్థను నాశనం చేసి ఫాసిజం స్థాపనకు ఉపయోగపడే మాస్టరు కాపినే జాతీయ విద్యావిధానం 2020 అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఈశ్వరయ్య తెలిపారు.

ఫాసిజానికి మాస్టర్‌ కాపీనే
మాట్లాడుతున్న సీపీఐ ఈశ్వరయ్య

వ్యవస్థలన్నీ బీజేపీ చేతుల్లోనే

జాతీయ విద్యావిధానం 2020పై సీపీఐ ధ్వజం

కడప (ఎడ్యుకేషన్‌), మే 26: దేశంలో లౌకి క ప్రజాస్వామ్య వ్యవస్థను నాశనం చేసి ఫాసిజం స్థాపనకు ఉపయోగపడే మాస్టరు కాపినే జాతీయ విద్యావిధానం 2020 అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఈశ్వరయ్య తెలిపారు. శుక్రవారం ఎస్‌ఎల్‌వీ ఫంక్షన్‌ హాలులో ఏఐఎ్‌సఎఫ్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న శిక్షణ తరగతులకు హాజరైన ఆయన మాట్లాడుతూ ‘జాతీయ విద్యావిధా నం 2020’పై మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచీ ఇప్పటి వరకు విద్యావ్యవస్థలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందేందుకు అనేక మా ర్పులు చేశారన్నారు. బీజేపీ అధికారం చేపట్టిన నాటి నుంచీ విద్యావ్యవస్థను సైతం తన చెప్పుచేతల్లో పెట్టుకుందన్నారు. రెండోసారి అధికారంలో వచ్చిన వెంటనే నూతన జాతీయ విద్యావిధానం కోసం కమిటీ ఏర్పాటు చేసిందన్నారు.

నూతన జాతీయ విద్యావిధానంలో టెన్‌ ప్లస్‌ 2 ప్లస్‌ త్రీగా ఉ న్న విద్యావిధానాన్ని 5 ప్లస్‌, 3 ప్లస్‌, 3 ప్లస్‌ ఫోర్‌గా మార్చడం, పాఠ్యాంశాలను కూడా ఆర్‌ఎ్‌సఎ్‌స్‌ అజెండా, మతతత్వ భావాల ను ఫాసిజా బానిసత్వపు భావాలను చే ర్చిందన్నారు. అందుకనుగునంగా పాఠ్య పుస్తకాలు తయారీ చేసిందని ఆరోపించా రు. ఇప్పటికే భగత్‌సింగ్‌ చరిత్ర, మొఘలుల చరిత్ర, జీవ పరిణామ క్రమం సిద్దాంతంలో డార్విన్‌ జీవ పరిణామ సిద్దాంతాన్ని పాఠ్యాంశాల నుంచి తొలగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మనరాష్ట్రానికి రావాలసిన హక్కులు రాకపోయినా బీజేపీ ఇవ్వకపోయినా వారి విధానాలకు రాష్ట్ర ప్రభు త్వం మద్దతు పలకడం అత్యంత నీచమైన చర్య అని విమర్శించారు. ఎన్‌ఏపీ రద్దు చేసే వరకు పోరాటం తప్పదన్నారు. కార్యక్రమంలో ఏపీడబ్ల్యుజె అధ్యక్షుడు సోమసుందర్‌సాగర్‌, ఏఐఎ్‌సఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి కేశవరెడ్డి, రాయలసీమ జిల్లాల నాయకత్వం జి.వలరాజు, బండి చలపతి, కోటేశ్వర్‌రావు, దివ్య, పవన్‌, ఉదయ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-05-26T23:16:09+05:30 IST