కథచెబుతూ ఆగిన గుండె

ABN , First Publish Date - 2023-09-22T23:33:46+05:30 IST

ఆద్యంతం సాసవల చిన్నమ్మకథ చెప్పడంలో విశేష గుర్తింపు తెచ్చుకు న్న కళాకారుడు రామాంజనేయులు(33) శుక్రవా రం తెల్లవారుజామున సాసవల చిన్నమ్మ కథ చెబుతుండగా ఒక్కసారిగా గుండెపోటుకు గురై మృతి చెందాడు. ఇటీవల తండ్రి వరణించడంతో ఆ కుటుంబానికి పెద్ద దిక్కు కోల్పోయినట్లైంది.

కథచెబుతూ ఆగిన గుండె
చివరిసారిగా కథ చెబుతున్న రామాంజనేయులు రామాంజనేయులు మృతదేహం (ఇన్‌సెట్‌లో )

సాసవల చిన్నమ్మ కథకుడు మృతి

ఇటీవలే తండ్రి మరణం

రోడ్డున పడిన కుటుంబం

లక్కిరెడ్డిపల్లె, సెప్టంబరు 22: ఆద్యంతం సాసవల చిన్నమ్మకథ చెప్పడంలో విశేష గుర్తింపు తెచ్చుకు న్న కళాకారుడు రామాంజనేయులు(33) శుక్రవా రం తెల్లవారుజామున సాసవల చిన్నమ్మ కథ చెబుతుండగా ఒక్కసారిగా గుండెపోటుకు గురై మృతి చెందాడు. ఇటీవల తండ్రి వరణించడంతో ఆ కుటుంబానికి పెద్ద దిక్కు కోల్పోయినట్లైంది. లక్కిరెడ్డిపల్లె మండలం పాళెంగొల్లపల్లె పంచాయ తీ చిన్నపోతులవాండ్లపల్లె వాసి కిన్నెర రామాంజ నేయులు సాసవల చిన్నమ్మకథ చెప్పడంలో ప్రత్యేక వేషధారణతో విశేష గుర్తింపు పొందిన కథకుడు. ఈయన ఉమ్మడి కడప జిల్లాలో ఒక గ్రూపును తయారు చేసి 15 ఏళ్లగా సాసవల చిన్నమ్మ కథను చెబుతూ జీవనం సాగించేవాడు.

ప్రస్తుతం రాయచోటి మండలం గొల్లపల్లెలో సాస వలచిన్నమ్మకథ చెప్పేందుకు ఒప్పించుకుని తెల్ల వారు జాము వరకు కథ చెప్పారు వేకువనే 4:30 గంటలకు ఒక్కసారిగా గుండె నొప్పివచ్చి కిందడిపోయాడు. దీంతో అతన్ని చికిత్స నిమి త్తం రాయచోటి ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందు తూ మృతి చెందినట్లు బంధు వులు తెలిపారు. కళాకారుడు రామాంజనేయులుకు భార్య కుమారుడు ఉన్నారు. తల్లి బతుకుదెరువు కోసం కువైత్‌ కు వెల్లింది. బిడ్డ మరణవార్త వినగానే తల్లి మనస్సు తల్ల డిల్లిపోయింది. ఇటీవలే తండ్రి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఇంటికి పెద్దదిక్కు తండ్రీ, కొడుకులు కొల్పోవడంతో ఆకుటుంబం వీధిన పడినట్లైంది.

కళాకారుల సంతాపం

సాసవలచిన్నమ్మకథ కాళాకారు డు కిన్నెర రామాంజనేయులు మృతి వార్త వినగానే గాలివీడు, రాయచోటి, మదనపల్లె, లక్కిరెడ్డి పల్లె కళాకారులు ఈశ్వరయ్య, నాగిరెడ్డి, తుమ్మల హరినాధ, రాజేంద్ర, రమణ, ఆర్మోనియం సహదేవ, బాబు, తలిస్టులు, రమణ, సురేసు, పాలగిరి కేశవ, హరినాధ, పురుషోత్తం తదితరు లు సంతాపం తెలిపారు.

Updated Date - 2023-09-22T23:33:46+05:30 IST