ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఇక్కడే ఏర్పాటు చేయాలి

ABN , First Publish Date - 2023-06-06T23:10:32+05:30 IST

అసియాలోనే అతిపెద్ద టమోటా మార్కెట్‌ ఉన్న మదనపల్లెకు కాకుండా కర్నూలు జిల్లా ప్యాపిలికి ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ తరలింపుపై మంగళవారం జనసేన ఆందోళన చేపట్టింది.

ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఇక్కడే ఏర్పాటు చేయాలి
మార్కెట్‌యార్డులో ధర్నా చేస్తున్న రాందా్‌సచౌదరి, జనసేన కార్యకర్తలు

మదనపల్లె, జూన 6: అసియాలోనే అతిపెద్ద టమోటా మార్కెట్‌ ఉన్న మదనపల్లెకు కాకుండా కర్నూలు జిల్లా ప్యాపిలికి ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ తరలింపుపై మంగళవారం జనసేన ఆందోళన చేపట్టింది. స్థానిక టమోటా మార్కెట్‌ వద్ద జనసేన రాయలసీమ కో-కన్వీనర్‌ గంగారపు రాందా్‌సచౌదరి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఏటా వేల కోట్ల రూపాయల వ్యాపారం జరిగే మదనపల్లె టమోటా వ్యాపారుల ఆశ లు అడియాసలు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని తప్పుపట్టారు. ఈ ప్రాంతంలో ఎక్కువగా సాగయ్యే టమోటాకు గిట్టుబాటు ధరలు లేక రైతులు తీవ్రం గా నష్టపోతున్నారని, ఈ క్రమంలో ఫుడ్‌, టమోటా ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ కొన్నేళ్లుగా ఉన్నా పట్టించుకోకుండా, మంజూరైన యూనిట్‌ కూడా ఇతర ప్రాంతానికి తరలించడంపై ఆయన ఆభ్యంతరం వ్యక్తం చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు చేతకానితనం వల్లే ఈ ప్రాంతానికి అన్యాయం జరుగుతోందని తెలిపారు. జనసేన ప్రభుత్వం ఏర్పడగానే అధినేతతో మాట్లాడి ఇక్కడ ఆ యూనిట్‌ను ఏర్పాటు చేసి నిరుద్యోగ, కూలీలకు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం, రాష్ట్ర చేనేత విభాగం నాయకుడు అడపా సురేంద్ర, జగదీష్‌, గ్రానైట్‌ బాబు, రెడ్డెమ్మ, సనావుల్లా, గౌతమ్‌, రెడ్డిశేఖర్‌, నవాజ్‌, రాజారెడ్డి, అఖిల్‌, నవీన, శ్రీకాంత, ఉమా, యష్‌ ఉన్నారు.

Updated Date - 2023-06-06T23:10:32+05:30 IST