స్పందనకు అర్జీల వెల్లువ
ABN , Publish Date - Dec 18 , 2023 | 11:46 PM
మదన పల్లె సబ్‌కలెక్టరేట్‌లో నిర్వహించిన స్పందన కార్యక్రమానికి ప్రజల నుంచి అర్జీలు వెల్లు వలా వచ్చాయి.
మదనపల్లె టౌన, డిసెంబరు 18: మదన పల్లె సబ్‌కలెక్టరేట్‌లో నిర్వహించిన స్పందన కార్యక్రమానికి ప్రజల నుంచి అర్జీలు వెల్లు వలా వచ్చాయి. సోమవారం ఆర్డీవో మురళి ఆధ్వర్యంలో నిర్వహించిన స్పందన కార్యక్ర మానికి ఎక్కువగా భూ వివాదాలు, ఈ పాసుపుస్తకాల మంజూరు, డీకేటీ భూముల వారసులు అర్జీలు అందజేశారు. మదనపల్లె మండలంలో భూ సర్వే చేయాలని ఆరు నెలల క్రితం చలానా కట్టినా ఇంత వరకు అధికారులు సర్వే చేయలేదని బీకేపల్లె గ్రామానికి చెందిన నూర్ జహాన ఆర్డీవోకు ఫిర్యా దు చేశారు. దీనిపై మండల సర్వేయర్‌కు నోటీసు ఇచ్చి సమస్య పరిష్కరించాలని సర్వే ఏడీ కృష్ణమూర్తిని ఆర్డీవో ఆదేశించారు. గ్రామానికి తాగునీరందించే చేతిబోరు ఉన్న ప్రాం తానికి దారి వదలకుండా కొందరు ఇబ్బందులు పెడుతున్నారని రామసముద్రం మండ లం మనేవారిపల్లె గ్రామస్థులు ఫిర్యాదు చేశారు. గ్రామ సచివాలయాల్లో ఎనర్జీ అసిస్టెం ట్లుగా పనిచేస్తున్న తమకు ప్రొబిషన డిక్లరేషన జీఎస్‌డబ్ల్యూ ఎస్ ద్వారా చేసి ఎస్‌ఆర్‌లు తెరవాలని ఆర్డీవోకు విన్నవించారు. దీంతో పాటు 42 మంది పలు సమస్యలపై ఆర్డీవోకు అర్జీలు ఇవ్వగా వాటిని సంబంధిత మండలాల అధికారులు పరిశీలించి పరిష్కరించాలని ఆర్డీవో ఆదేశించారు.