కడప టౌన్‌ ప్లానింగ్‌ అధికారిపై కేసు నమోదు

ABN , First Publish Date - 2023-09-22T23:32:22+05:30 IST

నగరంలోని దేవునికడప వద్ద వినాయక నిమజ్జ న విధులు నిర్వర్తిస్తున్న ఎస్‌ఐ రవికుమార్‌పై దురుసుగా ప్రవర్తించిన కడప కార్పొరేషన్‌ టౌన్‌ ప్లానింగ్‌ అధికారి నాగేంద్ర, అతని కుమారుడు, మరికొందరి పై కేసు నమోదు చేసినట్లు చిన్నచౌక్‌ పోలీసులు తెలిపారు.

కడప టౌన్‌ ప్లానింగ్‌ అధికారిపై కేసు నమోదు

కడప (క్రైం), సెప్టెంబరు 22: నగరంలోని దేవునికడప వద్ద వినాయక నిమజ్జ న విధులు నిర్వర్తిస్తున్న ఎస్‌ఐ రవికుమార్‌పై దురుసుగా ప్రవర్తించిన కడప కార్పొరేషన్‌ టౌన్‌ ప్లానింగ్‌ అధికారి నాగేంద్ర, అతని కుమారుడు, మరికొందరి పై కేసు నమోదు చేసినట్లు చిన్నచౌక్‌ పోలీసులు తెలిపారు. వినాయక నిమజ్జ నం కోసం వినాయక ప్రతిమను తీసుకుని నాగేంద్ర, అతని కుమారుడు మరి కొందరితో కలిసి పాత కడప చెరువుకు వెళ్లారు. అక్కడ విధుల్లో ఉన్న ఎస్‌ఐ రవికుమార్‌ ఆ ప్రాంతం రద్దీగా ఉండడంతో వారి వాహనాన్ని నిలిపేశారు. దీంతో టౌన్‌ ప్లానింగ్‌ అధికారి, అతని కుమారుడు మరికొందరితో కలిసి ఎస్‌ఐపై దురుసుగా ప్రవర్తిస్తూ విధులకు ఆటంకం కలిగించడంతో ఎస్‌ఐ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు తెలిపారు.

Updated Date - 2023-09-22T23:32:22+05:30 IST