సైకిల్‌ జోరుకు సతికిలబడ్డ ఫ్యాన

ABN , First Publish Date - 2023-03-18T23:38:01+05:30 IST

వైసీపీ ప్రజా వ్యతిరేక పాలనకు మండలి ఎన్నికలే నిదర్శనమని పలువురు పేర్కొన్నారు.

సైకిల్‌ జోరుకు సతికిలబడ్డ ఫ్యాన
చెన్నూరులో టీడీపీ విజయోత్సవాలు

వల్లూరు, మార్చి 18 : వైసీపీ ప్రజా వ్యతిరేక పాలనకు మండలి ఎన్నికలే నిదర్శనమని పలువురు పేర్కొన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి రాంగోపాల్‌రెడ్డి ఘన విజ యం సాధించడంతో సర్వత్రా సంబ రాలు జరుపుకున్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు రామక్రిష్ణారెడ్డి, ఓ బుల్‌రెడ్డి, మదన్‌మోహహనరెడ్డి, రా ఘవరెడ్డి, రామచంద్రారెడ్డి, చిట్టిబాబు, అబ్దుల్‌ రసూల్‌, నాగసుబ్బారెడ్డి, రమణారెడ్డి పాల్గొన్నారు.

చెన్నూరులో... భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి ఘన విజయంపై మండలంలో ని ప్రతి గ్రామ పంచాయతీలో టీడీపీ శ్రేణులు బాణసంచా పేల్చి, కేక్‌ కట్‌ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. చె న్నూరు బస్టాండులో మండల కన్వీనరు కె.విజయభాస్కర్‌రెడ్డి ఆధ్వర్యం లో టీడీపీ శ్రేణులు సంబరాలు జరు పుకున్నారు. మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ ఐ.శివారెడ్డి, టీడీపీ నేతలు కుం చెం రామక్రి ష్ణారెడ్డి, తాడిగొట్ల వెంకటసుబ్బారెడి, జిల్లా మైనార్టీ నేత షబ్బీర్‌ హుసేన్‌, ఆవుల పవన్‌ కుమార్‌రెడ్డి, పాలగిరి సుదర్శన్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌ మోహన్‌రెడ్డి, కొండపేట సుధాకరెడ్డి, లేబాక శివారెడ్డి, భవాని ఆచారి, ఖాజాహుసేన్‌ పాల్గొన్నారు.

వీఎనపల్లెలో...టీడీపీ మండల కన్వీనర్‌ బైరెడ్డి విజయభాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ప్రసాదరెడ్డి, మండల టీడీపీ రైతు సంఘం అధ్యక్షుడు చం ద్రశేఖర్‌రెడ్డి, మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి గంగిరెడ్డి, గోపాల్‌ యాదవ్‌రెడ్డి, సీతారామయ్య, ఎన పాలగిరి వడ్లమిషన సుదర్శనరెడ్డి, ఈర్లపల్లె ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.

వేంపల్లెలో... మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ మైనార్టీ కార్పొరేషన మాజీ డైరెక్టర్‌ షబ్బీర్‌, మండల కన్వీనర్‌ మునిరెడ్డి, పోతిరెడ్డి శివ ఆధ్వ ర్యంలో బాణసంచా పేల్చి స్వీట్లు పంచిపెట్టారు. పొట్టిపాటి మోహనరెడ్డి, దేవస్థాన మాజీసభ్యులు తిప్పారెడ్డి, పివి రమణ, నల్లగారి కృష్ణారెడ్డి, పూల అల్లాబక్షు, గోటూరు నాగభూషణం, దేవస్థాన మాజీ చైర్మన కొండయ్య, మైనార్టీ నాయకులు మహబూబ్‌ షరీఫ్‌, తదితరులు పాల్గొన్నారు.

పెండ్లిమర్రిలో..

టీడీపీ నాయకులు స్వీట్లుపంచి సంబరాలు చేసుకున్నారు. పార్టీ మండల అధ్యక్షుడు గంగిరెడ్డి, సర్పంచు ప్రతా్‌పరెడ్డి, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

సింహాద్రిపురంలో...

టీడీపీ నాయకుడు శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్సీ బీటెక్‌ రవి ఇంటి ఆవరణంలో స్వీట్లు పంపిణీ చేసి, బాణసంచా పేల్చారు. సునీల్‌రెడ్డి, చిన్నోడు, మురళి, రామిరెడ్డి, పలు గ్రామాల నుండి టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-18T23:38:01+05:30 IST