Share News

56 అంశాలు.. ఒక్క నిమిషంలో ముగిసిన సమావేశం

ABN , First Publish Date - 2023-11-01T00:21:02+05:30 IST

మున్సిపల్‌ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 54పేజీలు, 56 అంశాలు గల అజెండాపై ఏమాత్రం చర్చ జరగకుండానే నిమిషం వ్యవధిలో సమా వేశాన్ని ముగించేశారు.

56 అంశాలు.. ఒక్క నిమిషంలో ముగిసిన సమావేశం

మదనపల్లె, అక్టోబరు 31: మున్సిపల్‌ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 54పేజీలు, 56 అంశాలు గల అజెండాపై ఏమాత్రం చర్చ జరగకుండానే నిమిషం వ్యవధిలో సమా వేశాన్ని ముగించేశారు. నలుగురు కౌన్సిలర్లు మినహా అందరూ బయటకు రావడం సం చలనానికి దారితీసింది. మంగళవారం నాటి మున్సిపల్‌ అత్యవసర సమావేశం స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో చైర్‌పర్సన వి.మనూజా అధ్యక్షతన మధ్యాహ్నం 3గంటలకు ప్రారంభం కాగానే, మున్సిపల్‌ వైస్‌చైర్మన జింకా వెంకటాచలపతి అజెండా ఆమోదం అంటూ లేచి బయటకు వస్తుండటంతో ఆది నుంచీ రెబల్‌గాఉంటూ అటు పాలకులు, ఇటు అధికారులపై అసంతృప్తిగా ఉంటున్న ఆ నలుగురు కౌన్సిలర్లు..ఆమోదాన్ని మేం తిరస్కరిస్తున్నాంటూ పైకి లేచినిలబడ్డారు. అంతే మిగిలిన సభ్యులంతా వెనువెంటనే సమావేశ మందిరం నుంచి బయటకు రావడంతో సమావేశం ముగిసినట్లయింది. అంతలో అక్కడే ఉన్న 32వ వార్డు కౌన్సిలర్లు ఎం.నాగార్జునబాబు(గాంధీ), ఆరోవార్డు కె.ప్రసాద్‌బాబు, 22వవార్డు కౌన్సిలర్‌ ఎస్‌.ముబీనా, 23వవార్డు వై.గిరిజాలు ఒక్కొక్కరు మున్సిపల్‌ కమిషనర్‌ కె.ప్రమీలను వివిధ అంశాలపై ప్రశ్నించారు. ముఖ్యంగా గతనెలలో మున్సిపల్‌ సమావేశం ఎందుకు జరగలేదో, కారణాలేంటో చెప్పాలని నాగార్జునబాబు నిలదీశారు. 56 అంశాలతో కూడిన అజెండాను రాత్రి 8గంటలకు ఇచ్చి..అవగాహన లేకుం డా ఏం మాట్లాడేది? ఏకపక్షంగా ఆమోదం అని చెప్పి వెళ్లిపోతున్నారు. మేం తిరస్కరిస్తు న్నామంటూ నాగార్జునబాబు పేర్కొన్నారు. 25వతేదీనే మీకు అంశాలను, అన్ని విషయాలను ఫోనలో చెప్పానని, కమిషనర్‌ ప్రమీల బదులిచ్చారు.

ఒంటరైన చైర్‌పర్సన..!

కౌన్సిల్‌హాలులో ఆశీనులైన చైర్‌పర్సన మనూజా ఒంటరైనట్లు కనిపించింది. సమావేశం ప్రారంభం కాగానే, అజెండా ఆమోదం అంటూ అధికార పార్టీవారే లేచి వెళ్లిపోగా, ఆమె మాత్రం అలానే చూస్తూ ఉండిపోయారు. ఇప్పటికే రెండుసమావేశాలు జరగకపోగా, మంగళవారం నాటి సమావేశం కూడా ఉండదనే అందరూ భావించారు. అయితే పాలకవర్గం ఉనికికే ప్రమాదం వచ్చే పరిస్థితి ఉందన్న నిపుణుల హెచ్చరికతో నెలలో చివరిరోజున అత్యవసరం సమావేశం పేరుతో మమ అనిపించారు.

Updated Date - 2023-11-01T00:21:02+05:30 IST