గండిరోడ్డు అభివృద్ధికి రూ.13.50కోట్లు మంజూరు
ABN , First Publish Date - 2023-06-26T23:45:51+05:30 IST
వేంపల్లె నాలుగు రోడ్ల కూడలి నుంచి గండిరోడ్డులో రాయచోటి బైపా్‌సరోడ్డు వరకు రోడ్డు ఏర్పాటు, ఇతర పనుల కోసం రూ.13.50 కోట్లు మంజూరయ్యాయి. ఈ మేరకు రోడ్డు భవనాల శాఖ కార్యదర్శి ప్రద్యుమ్న ఉత్తర్వులు జారీ చేశారు.
వేంపల్లె, జూన 26: వేంపల్లె నాలుగు రోడ్ల కూడలి నుంచి గండిరోడ్డులో రాయచోటి బైపా్‌సరోడ్డు వరకు రోడ్డు ఏర్పాటు, ఇతర పనుల కోసం రూ.13.50 కోట్లు మంజూరయ్యాయి. ఈ మేరకు రోడ్డు భవనాల శాఖ కార్యదర్శి ప్రద్యుమ్న ఉత్తర్వులు జారీ చేశారు. వేంపల్లె పట్టణంలో రోడ్డు వెడల్పు చేసి కొత్తరోడ్డు ఏర్పాటు, డివైడర్, సెంట్రల్ లైటింగ్, ఫుట్‌పాత ఏర్పాటు చేయాలనే నిర్ణయంతో ఇప్పటికే వెడల్పునకు సేకరించిన స్థలాలకు సంబంధించి బాధితులకు పరిహారం పంపిణీ చేశారు. ప్రస్తుతం గండిరోడ్డులో సుమారు 0.8 కిలోమీటర్ల పొడవున కొత్తరోడ్డు నిర్మాణం, సెంటట్రల్ లైటింగ్, ఫుట్ పాత ఇతరపనుల కోసం తాజాగా ఈ నిధులు మంజూరయ్యాయి. కడప ఎంపీ వైఎస్ అవినా్‌షరెడ్డి చొరవతో ముఖ్యమంత్రి వైఎస్ జగనమోహనరెడ్డి నిధులు విడుదల చేయడం పట్ల జడ్పీటీసీ సభ్యుడు రవికుమార్‌రెడ్డి హర్షం వెలిబుచ్చారు.