YSRCP : జగన్ సొంత ఇలాకాలో సీన్ రివర్స్.. జనంలోకి వెళ్లాలంటే భయపడుతున్న వైసీపీ ఎమ్మెల్యేలు

ABN , First Publish Date - 2023-07-28T19:52:09+05:30 IST

అవును.. మీరు వింటున్నది నిజమే.. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు (AP Elections) సమీపిస్తున్న కొద్ది అధికార పార్టీకి అన్నీ ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. ఓ వైపు అనాలోచిత నిర్ణయాలతో న్యాయస్థానాల్లో ఊహించని షాకులు.. మరోవైపు ప్రజల్లో నిరసన సెగలతో వైసీపీ సిట్టింగ్‌లు (YSRCP Sitting Mlas) జనాల్లోకి వెళ్లాలంటే జంకుతున్నారు...

YSRCP : జగన్ సొంత ఇలాకాలో సీన్ రివర్స్.. జనంలోకి వెళ్లాలంటే భయపడుతున్న వైసీపీ ఎమ్మెల్యేలు

అవును.. మీరు వింటున్నది నిజమే.. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు (AP Elections) సమీపిస్తున్న కొద్ది అధికార పార్టీకి అన్నీ ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. ఓ వైపు అనాలోచిత నిర్ణయాలతో న్యాయస్థానాల్లో ఊహించని షాకులు.. మరోవైపు ప్రజల్లో నిరసన సెగలతో వైసీపీ సిట్టింగ్‌లు (YSRCP Sitting Mlas) జనాల్లోకి వెళ్లాలంటే జంకుతున్నారు. అయితే ఇతర జిల్లాల్లో ఈ పరిస్థితి ఉంటే ఉండొచ్చు గానీ.. సీఎం వైఎస్ జగన్ రెడ్డి సొంత ఇలాకా ఉమ్మడి కడప జిల్లాలో (Kadapa District) కూడా ఇలానే ఉండటం గమనార్హం.


Mla-Dasari-Sudha.jpg

చేదు అనుభవాలే..!

గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో వైసీపీ ఎమ్మెల్యేలు గ్రామాల బాట పట్టిన సంగతి తెలిసిందే. అయితే.. ఏం చేశారని మా గ్రామానికి వచ్చారు..? ఎన్నికల్లో మీరిచ్చిన హామీలేంటి..? మీరు నెరవేర్చినవి ఏంటి..? అని ఎక్కడ చూసినా ఎమ్మెల్యేలను జనాలు నిలదీస్తున్న పరిస్థితి. ఇలాంటి వార్తలు మనం టీవీల్లో, వార్తా పత్రికల్లో చాలానే చూసి ఉంటాం. కడప జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉండటం వైసీపీ శ్రేణులను కలవరపాటుకు గురిచేస్తున్న విషయం. జనంలోకి వెళ్లాంటే ఉమ్మడి కడప జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు భయపడిపోతున్నారు.

YSRCP.jpg

మాకేం చేశారు..?

బద్వేల్ ఎమ్మెల్యే దాసరి సుధకు (Mla Dasari Sudha) అట్లూరు మండలం కమలకూరులో చేదు అనుభవం ఎదురైంది. సమస్యలపై ఎమ్మెల్యేను గ్రామస్తులు నిలదీశారు. గ్రామంలో ఒక్క సమస్య కూడా పరిష్కరించలేదని గ్రామంలో తలుపులు మూసి గ్రామస్తులు నిరసన తెలిపారు. భూ అసైన్మెంట్లలో తమ గ్రామానికి చెందిన వారికి కాకుండా బయట వారికి భూములు కేటాయిస్తున్నారని ఎమ్మెల్యేపై గ్రామస్తులు మండిపడ్డారు. మరికొందరు.. జగనన్న ఇళ్లలో (Jagananna Illu) అర్హులకు కాకుండా అనర్హులకు ఇల్లు కేటాయించారని ఆరోపిస్తున్నారు. సమస్యల పరిష్కారానికి సరైన సమాధానం చెప్పలేక మధ్యలోనే గడప గడపకు కార్యక్రమం ముగించుకొని ఎమ్మెల్యే వెళ్లిపోయారు. కాగా.. ఇలాంటి పరిస్థితులు ఒక్క బద్వేల్ ఎమ్మెల్యేకే కాదు.. కడప జిల్లాల్లో చాలా మందికి ఇలాంటి అనుభవాలే ఎదురయ్యాయి.

Updated Date - 2023-07-28T19:53:25+05:30 IST