IT Employees: చంద్రబాబు కోసం రోడ్డెక్కిన హైదరాబాద్ ఐటీ ఉద్యోగులు

ABN , First Publish Date - 2023-09-14T03:59:37+05:30 IST

రాజకీయ కుట్రలో భాగంగానే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును అరెస్టు చేశారని హైదరాబాద్‌లోని ఐటీ ఉద్యోగులు మండిపడ్డారు. తమ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఆయన వెంటే ఉంటామని నినదించారు. సీఎం జగన్‌ ప్రజా వ్యతిరేక చర్యలను చంద్రబాబు తన పర్యటనల్లో జనానికి వివరిస్తుండడంతో

IT Employees: చంద్రబాబు కోసం రోడ్డెక్కిన హైదరాబాద్ ఐటీ ఉద్యోగులు

హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగుల నిరసన

విప్రో సర్కిల్‌లో భారీ ప్రదర్శన

బాబు దేశం గర్వించ తగిన నేత

ఆయన వల్లే హైదరాబాద్‌లో ఐటీ అభివృద్ధి

ఆయన విజన్‌తోనే దేశవిదేశాల్లో మన ఐటీ ఉద్యోగులు

టీడీపీ అధినేత అరెస్టు..ప్రపంచానికే బ్లాక్‌డే.. నిరసనకారుల ధ్వజం

హైదరాబాద్‌ సిటీ/రాయదుర్గం, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): రాజకీయ కుట్రలో భాగంగానే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును అరెస్టు చేశారని హైదరాబాద్‌లోని ఐటీ ఉద్యోగులు మండిపడ్డారు. తమ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఆయన వెంటే ఉంటామని నినదించారు. సీఎం జగన్‌ ప్రజా వ్యతిరేక చర్యలను చంద్రబాబు తన పర్యటనల్లో జనానికి వివరిస్తుండడంతో ఓటమి భయంతోనే అక్రమ అరెస్టుకు కుట్ర చేశారని ఆరోపించారు. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఐటీ ఉద్యోగులు, టీడీపీ శ్రేణులు, బాబు అభిమానులు పలు ప్రాంతాల్లో బుధవారం రోడ్లెక్కారు. ఏపీ ప్రభుత్వ వైఖరి, సీఎం జగన్‌ తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. బుధవారం నానక్‌రామ్‌గూడ ఐటీ జోన్‌లోని విప్రో సర్కిల్‌కు వేల సంఖ్యలో ఐటీ ఉద్యోగులు చేరుకున్నారు. భారీగా నిరసన ప్రదర్శన చేపట్టారు. ‘ఐయామ్‌ విత్‌ సీబీఎన్‌’ అని రాసి ఉన్న ప్లకార్డులను, బ్యానర్లను ప్రదర్శించారు. ‘వుయ్‌ వాంట్‌ జస్టిస్‌.. జై బాబు.. జై బాబు..’ అంటూ నినాదాలు చేశారు. బ్రిటిష్‌ హయాంలోనూ ఇంత దారుణమైన పాలన సాగలేదన్నారు. జగన్‌ రాక్షస పాలనకు వ్యతిరేకంగా ప్రజలందరు ముందుకు రావాలని ఉందని పిలుపిచ్చారు. చంద్రబాబు కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమన్నారు. రాజకీయ కుట్రలో భాగంగానే చంద్రబాబును అరెస్టు చేశారన్నారు. ‘చంద్రబాబు దేశం గర్వించ తగిన నాయకుడు. ఆయన వల్లే హైదరాబాద్‌లో సాంకేతిక రంగం విస్తృతంగా అభివృద్ధి చెందింది. ఆయన వల్లే మేమంతా ఐటీ ఉద్యోగులుగా ఇప్పుడు సౌకర్యవంతమైన జీవనం గడుపుతున్నాం. ఇప్పుడు దేశ విదేశాల్లో మన ఐటీ ఉద్యోగులు పనిచేస్తున్నారంటే అది ఆయన విజన్‌ వల్లే జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో పేదరికం పోయి కుటుంబాలు ఆనందంగా బతకడానికి చంద్రబాబు ప్రధాన కారకుడు. ఆయన అరెస్టు ప్రపంచానికే బ్లాక్‌ డే’ అని స్పష్టం చేశారు.

9hyd1.jpg

3 వేల ఐటీ కంపెనీలు..

చంద్రబాబు విజన్‌తో హైదరాబాద్‌లో 3 వేల ఐటీ కంపెనీలు వెలిశాయని, 10 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చాయని ఉద్యోగులు తెలిపారు. ‘2023 విశ్లేషణ ప్రకారం హైదరాబాద్‌ నగరం నుంచి 32 వేల బిలియన్‌ డాలర్ల ఐటీ ఎగుమతులు జరుగుతున్నాయంటే.. ఆయన విజన్‌ మూలంగానే సాధ్యమైంది. ఆయన తెచ్చిన సాంకేతిక విప్లవాన్ని ప్రపంచ దేశాలు కూడా అమలు చేస్తున్నాయి’ అని తెలిపారు. కుల మతాలు, రాజకీయాలకతీతంగా నిరసన తెలుపుతున్నామన్నారు. బాబు అక్రమ అరెస్టుపై తెలంగాణ సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ స్పందించాలని డిమాండ్‌ చేశారు. ఆయన జైలు నుంచి బయటకు వస్తే.. తెలంగాణలో అభివృద్ధిపై ప్రభావం పడుతుందనే వారు మాట్లాడడం లేదని పేర్కొన్నారు. ఐటీ ఉద్యోగులు భారీ సంఖ్యలో తరలిరావడంతో పోలీసులు వారిని అదుపు చేయలేక ఇబ్బందులు పడ్డారు. ర్యాలీని అడ్డుకునేందుకు యత్నించినా.. వారు ముందుకు తోసుకు వెళ్లారు. అనుమతులు లేకపోవడం, నిరసనకారులు ఎంత చెప్పినా వినక పోవడంతో పోలీసులు చివరకు లాఠీచార్జి చేసి వారందరినీ చెదరగొట్టారు.

1AKY-(8).jpg

కేపీహెచ్‌బీలో ఏపీ పరిరక్షణ సమితి ఆందోళన

కూకట్‌పల్లి, సెప్టెంబర్‌ 13 (ఆంధ్రజ్యోతి): చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఆందోళనలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్‌ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో బుధవారం కేపీహెచ్‌బీకాలనీలోని గాంధీ విగ్రహం వద్ద భారీ ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. 500 మందికిపైగా చంద్రబాబు అభిమానులు రహదారిపైకి వచ్చిన నిరసన వ్యక్తం చేశారు. జై చంద్రబాబు... జైజై చంద్రబాబు అంటూ రెండు గంటల పాటు జాతీయరహదారిపై నినాదాలు చేశారు. ‘సైకో పోవాలి.. సైకిల్‌ రావాలి’ అని ప్లకార్డులు ప్రదర్శించారు. చంద్రబాబును వెంటనే విడుదల చేయకుంటే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని ఏపీ పరిరక్షణ సమితి సభ్యుడు కొలికపూడి శ్రీనివాస్‌ హెచ్చరించారు.

9hyd2.jpg

9hyd3.jpg

Updated Date - 2023-09-14T11:05:05+05:30 IST