AP NEWS: చెరువులో ఆక్రమణలు తొలగించాలని హైకోర్టు తీర్పు.. గ్రామస్తుల ఆందోళన
ABN , Publish Date - Dec 26 , 2023 | 02:56 PM
పాలకొడేరు మండలం వేండ్రలో అగ్రహరం గ్రామస్తులు ఆందోళనకు దిగారు. చెంబుడు చెరువును ఆక్రమించి ఇళ్ళు నిర్మించారని గ్రామస్తుడు దుర్గారావు కోర్టును ఆశ్రయించారు.
పశ్చిమగోదావరి జిల్లా: పాలకొడేరు మండలం వేండ్రలో అగ్రహరం గ్రామస్తులు ఆందోళనకు దిగారు. చెంబుడు చెరువును ఆక్రమించి ఇళ్ళు నిర్మించారని గ్రామస్తుడు దుర్గారావు కోర్టును ఆశ్రయించారు. దుర్గారావు పిటీషన్‌తో ఆక్రమణలు తొలగించాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఇళ్లు తొలగించేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. ఆగ్రహం వ్యక్తం చేస్తూ గ్రామస్తులు ధర్నాకు దిగి ఆందోళన చేపట్టారు. దుర్గారావు దిష్టిబొమ్మను ఊరేగించి పంచాయితీ దగ్గర గ్రామస్తులు దహనం చేశారు. గ్రామస్తులకు ఎమ్మెల్యే మంతెన రామరాజు, ఎంపీపీ సత్యనారాయణరాజు సంఘీభావం తెలిపారు.