Chandrababu news: చంద్రబాబు పిటిషన్‌పై విచారణ శుక్రవారానికి వాయిదా

ABN , First Publish Date - 2023-10-10T14:38:13+05:30 IST

స్కిల్ డెవలప్‌మెంట్ అక్రమ కేసులో మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణ శుక్రవారానికి వాయిదా పడింది. శుక్రవారం మధ్యాహ్నం గం. 2.00కు తదుపరి విచారణ జరుగుతుందని కోర్ట్ వెల్లడించింది.

Chandrababu news: చంద్రబాబు పిటిషన్‌పై విచారణ శుక్రవారానికి వాయిదా

న్యూఢిల్లీ: స్కిల్ డెవలప్‌మెంట్ అక్రమ కేసులో మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణ శుక్రవారానికి వాయిదా పడింది. శుక్రవారం మధ్యాహ్నం గం. 2.00కు తదుపరి విచారణ జరుగుతుందని కోర్ట్ వెల్లడించింది. కాగా మంగళవారం ఇరుపక్షాల న్యాయవాదులు హోరాహోరీగా వాదనలు వినిపించారు. చంద్రబాబు తరఫున హరీశ్ సాల్వే వాదించగా.. ఏపీ ప్రభుత్వం తరఫున ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు.


కాగా.. సుప్రీంకోర్టులో మంగళవారం జరిగిన వాదనలు ప్రధానంగా 17 ఏ చుట్టూనే తిరిగాయి. ప్రభుత్వ న్యాయవాది ముకుల్‌ రోహత్గీపై జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం మూడు ప్రశ్నలు సంధించింది. ఆ మూడు ప్రశ్నలకూ ముకుల్ రోహత్గి సరైన సమాధానం చెప్పలేకపోయారు. ఇక 17A నేరానికి వర్తిస్తుందా ? నిందితులకు వర్తిస్తుందా? అని జస్టిస్ బేలా త్రివేది ప్రశ్నించారు. 2018లో విచారణ ప్రారంభించినప్పుడు ఏం కనిపెట్టారు? అని ప్రశ్నించారు. ‘అవినీతికి సంబంధించిన సెక్షన్ అమలు కాకపోతే మిగతా సెక్షన్స్ కింద ప్రత్యేక కోర్టు విచారించవచ్చా ?... మిగతా సెక్షన్ ల కింద పెట్టిన కేసులు చెల్లుతాయా ? లేదా ?’ అని జస్టిస్ బేలా త్రివేది ప్రశ్నించారు. ఈ ప్రశ్నల్లో వేటికీ కూడా ముకుల్ రోహిత్గీ సరైన సమాధానం ఇవ్వకపోవడం గమనార్హం.

Updated Date - 2023-10-10T14:43:27+05:30 IST