వైసీపీపై తిరుగుబాటు మొదలైంది

ABN , First Publish Date - 2023-03-19T00:33:14+05:30 IST

వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని గురజాల మాజీఎమ్మెల్యే, టీడీపీ సీనియర్‌నేత యరపతినేని శ్రీనివాసరావు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.

వైసీపీపై తిరుగుబాటు మొదలైంది

పిడుగురాళ్ల, మార్చి 18: వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని గురజాల మాజీఎమ్మెల్యే, టీడీపీ సీనియర్‌నేత యరపతినేని శ్రీనివాసరావు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. పట్టభద్రుల ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడం ఇందుకు నిదర్శనం అన్నారు. రాష్ట్రంలో అఽధికారంలో వున్న వైసీపీ పట్టభద్రులను, ఉపాధ్యాయులను బెదిరించి ఓట్లు వేయించుకోవాలని చూసినప్పటికీ యువత ఆలోచించి వేసిందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్నో అడ్డంకులు సృష్టించి, డబ్బులు పంపిణీ చేసి, దొంగఓట్లు వేయించినప్పటికీ ఓటమి చవిచూసిందన్నారు. ఈ మార్పే సాధారణ ఎన్నికల్లో టీడీపీ గెలుపునకు నాంది అని యరపతినేని గుర్తుచేశారు. రాష్ట్రంలో చదువుకున్న యువత, పట్టభద్రులు, మహిళలతో పాటు ప్రతిఒక్కరు వైసీపీ విధానాలతో విసుగుచెందారని, రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైసీపీని సాగనంపేందుకు ఓటు వేయడం తధ్యమన్నారు. రాష్ట్రంలో ఫ్యాన్‌ గాలి జోరు తగ్గిందని, సైకిల్‌ స్పీడ్‌ పెరిగిందన్నారు. ఇప్పటికైనా కొందరు అధికారులు అధికారానికి ఒత్తాసు పలకడం మానుకొని న్యాయబద్ధంగా వ్యవహరించాలని యరపతినేని శ్రీనివాసరావు పేర్కొన్నారు.

Updated Date - 2023-03-19T00:33:14+05:30 IST