వసతిగృహ వార్డెన్‌ భర్త అరెస్ట్‌

ABN , First Publish Date - 2023-01-25T00:30:03+05:30 IST

స్థానిక ఎస్సీబాలికల వసతి గృహ వార్డెన్‌ భర్త పవన్‌కుమార్‌ను ఫోక్సో చట్టం కింద అరెస్టు చేసినట్లు దుగ్గిరాల ఎస్‌ఐ శ్రీనివాసరెడ్డి తెలిపారు.

వసతిగృహ వార్డెన్‌ భర్త అరెస్ట్‌

దుగ్గిరాల, జనవరి 24: స్థానిక ఎస్సీబాలికల వసతి గృహ వార్డెన్‌ భర్త పవన్‌కుమార్‌ను ఫోక్సో చట్టం కింద అరెస్టు చేసినట్లు దుగ్గిరాల ఎస్‌ఐ శ్రీనివాసరెడ్డి తెలిపారు. స్థానిక జడ్పీ హైస్కూల్‌లో పదోతరగతి చదువుతూ ఎస్సీ బాలికల వసతిగృహంలో ఉంటున్న బాలిక పట్ల అతను అసభ్యంగా ప్రవర్తించినట్లు తల్లిదండ్రులు ఫిర్యాదు చేసిన విషయం విదితమే. మంగళగిరి డీఎస్పీ రాంబాబు, సీఐ నాగభూషణం సోమవారం జరిపిన విచారణ అనంతరం మంగళవారం సాయంత్రం పవన్‌కుమార్‌ను అరెస్ట్‌ చేశారు.

Updated Date - 2023-01-25T00:30:03+05:30 IST