ఫిబ్రవరి 15 నుంచి విజ్ఞాన్‌ మహోత్సవ్‌

ABN , First Publish Date - 2023-01-22T03:25:40+05:30 IST

గుంటూరు సమీపంలోని విజ్ఞాన్‌ విశ్వవిద్యాలయంలో ఫిబ్రవరి 15 నుంచి 17వ తేదీ వరకు విజ్ఞాన్‌ మహోత్సవ్‌ పేరుతో యూత్‌ ఫెస్టివల్‌ నిర్వహిస్తున్నట్టు విజ్ఞాన్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య శనివారం తెలిపారు.

ఫిబ్రవరి 15 నుంచి విజ్ఞాన్‌ మహోత్సవ్‌

గుంటూరు(విద్య), జనవరి 21: గుంటూరు సమీపంలోని విజ్ఞాన్‌ విశ్వవిద్యాలయంలో ఫిబ్రవరి 15 నుంచి 17వ తేదీ వరకు విజ్ఞాన్‌ మహోత్సవ్‌ పేరుతో యూత్‌ ఫెస్టివల్‌ నిర్వహిస్తున్నట్టు విజ్ఞాన్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య శనివారం తెలిపారు. ఈ మేరకు వడ్లమూడిలోని వర్సిటీలో పోస్టర్స్‌ ఆవిష్కరించారు. జాతీయ స్థాయిలో నిర్వహించే విజ్ఞాన్‌ మహోత్సవ్‌కు వివిధ రాష్ట్రాల నుంచి 50 వేల మంది విద్యార్థులు తరలివచ్చే అవకాశముందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మహోత్సవ్‌లో స్పోర్ట్స్‌, లిటరరీ, ఫైన్‌ ఆర్ట్స్‌, ఫ్యాషన్‌, మ్యూజిక్‌, డ్యాన్స్‌, స్పాట్‌లైట్‌, థియేటర్‌ ఆర్ట్స్‌ తదితర 82 ఈవెంట్స్‌ ఉంటాయని తెలిపారు. పోస్టర్స్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో వీసీ డాక్టర్‌ పి.నాగభూషణ్‌, రిజిస్ట్రార్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-01-22T03:25:40+05:30 IST