యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా వెంకటేశ్వర్లు

ABN , First Publish Date - 2023-04-03T02:17:13+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌(యూటీఎఫ్‌) రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్‌.వెంకటేశ్వర్లు తిరిగి ఎన్నికయ్యారు.

యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా వెంకటేశ్వర్లు

అమరావతి, ఏప్రిల్‌ 2(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌(యూటీఎఫ్‌) రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్‌.వెంకటేశ్వర్లు తిరిగి ఎన్నికయ్యారు. ఆదివారం విజయవాడలో నిర్వహించిన యూటీఎఫ్‌ 48వ కౌన్సిల్‌ సమావేశంలో కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా ప్రసాద్‌, గౌరవాధ్యక్షుడిగా కె.శ్రీనివాసరావు, సహాధ్యక్షులుగా కె.సురేశ్‌కుమార్‌, ఏఎస్‌ కుసుమ కుమారి, కోశాధికారిగా బి.గోపీమూర్తి, కార్యదర్శులుగా బి.లక్ష్మీరాజా, ఎన్‌.నాగమణి, టి.రఘుపతిరెడ్డి, సీహెచ్‌ రవీంద్ర, ఎస్‌పీ మనోహర్‌కుమార్‌, డీవీ రాఘవులు, ఎస్‌.మురళీమోహనరావు, ఎన్‌.అరుణకుమారి, ఎస్‌ఎస్‌ నాయుడు, ఎన్‌.నవకోటేశ్వరరావు, వి.కోటేశ్వరప్ప, కేఏ ఉమామహేశ్వరరావు, రెడ్డి మోహనరావు, టి.అన్నారాము, బి.సుభాషిణి ఎన్నికయ్యారు.

Updated Date - 2023-04-03T02:17:13+05:30 IST