‘మూడు’ మార్చిన మూడు

ABN , First Publish Date - 2023-03-19T03:05:09+05:30 IST

మూడు పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానాల్లో ఓటమితో అధికార వైసీపీలో మూడు మారిపోయింది. ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ జిల్లాల్లో ఓడినా.

‘మూడు’ మార్చిన మూడు

ముభావంగా ముఖ్యమంత్రి.. మంత్రులు, ఎమ్మెల్యేలదీ అదే పరిస్థితి

అమరావతి, మార్చి 18(ఆంధ్రజ్యోతి): మూడు పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానాల్లో ఓటమితో అధికార వైసీపీలో మూడు మారిపోయింది. ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ జిల్లాల్లో ఓడినా... పశ్చిమ రాయలసీమలో గట్టెక్కుతామని శుక్రవారం రాత్రిదాకా వైసీపీ నేతలు భావించారు. కానీ... శనివారం మధ్యాహ్నానికి ఆ ఆశలూ అవిరయ్యాయి. ఢిల్లీ టూర్‌ ముగించుకుని వచ్చిన సీసీఎం జగన్‌ శనివారం శాసనసభకు వచ్చారు. ఉపాధ్యాయ కోటా ఎమ్మెల్సీ ఎన్నిక ల్లో విజయం సాధించిన వైసీపీ అభ్యర్ధులు అసెంబ్లీ ప్రాంగణంలోని సీఎం చాంబర్‌ లో జగన్‌ని కలిశారు. కానీ... గ్రాడ్యుయేట్‌ కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరాజయంతో సీఎం ముభావంగానే ఉన్నారు. మధ్యాహ్నం దాకా శాసనసభలోనికి రాలేదు.

ఇది ‘ఒక చిన్న సెక్షన్‌’.. సజ్జల భాష్యం

మూడు పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానాల్లో ఓటమిని వైసీపీ ముఖ్యనేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి తేలిగ్గా తీసుకున్నారు. ‘ఇది ఏరకంగానూ రాబోయే ఎన్నికల ఫలితాలకు సంకేతం కాదు’ అని వ్యాఖ్యానించారు. ఒక చిన్న వర్గానికి చెందిన(గ్రాడ్యుయేట్స్‌) ఓటర్లు నిర్ణయాత్మకం కాబోరని అన్నారు. పట్టభద్ర ఎమ్మెల్సీ ఫలితాలపై శనివారం ఆయన మాట్లాడారు. ‘‘9 లక్షల పట్టభద్రుల ఓట్లతో అంతా అయిపోయిందని చెప్పలేం. ఇది చాలా చిన్న సెక్షన్‌. వైసీపీ ప్రభుత్వ ప్రాధాన్యాలు ఏయే వర్గాలకు మేలు చేశాయో... ఆ వర్గాలు ఈ ఓటర్లలో లేరు. దీంట్లోనూ కొద్దిమంది ఉండొచ్చు. కానీ... వీరి ఓటు సార్వత్రిక ఎన్నికల్లో నిర్ణయాత్మకం కాదు. అన్ని వర్గాల ఓటర్లు ఉన్నప్పుడే నిజమైన పరీక్ష. అది సార్వత్రిక ఎన్నికల్లోనే ఉంటుంది. అందువల్ల ఈ ఎన్నికలను ఏరకంగానూ భవిష్యత్తుకు సంకేతం అనుకోకూడదు’’ అని సజ్జల సూత్రీకరించారు. ఎన్నడూలేని విధంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల్లో పోటీచేసి, రెండు స్థానాలనూ గెలిచామని చెప్పారు. అదే సమయంలో... పట్టభద్ర ఓటర్లను చేరుకోవడంలో వెనుక బడ్డామని ఆయన అంగీకరించారు. ‘‘ఈ ఫలితాలు చూసో, పవన్‌తో పొత్తుతోనో శక్తి పెరిగింద నో టీడీపీ సంబరాలు చేసుకుంటే అది వాళ్ల ఆనందం. పోలైన ఓట్లు ఎన్ని అనేది చూడాలి’’ అని అన్నారు. పట్టభద్రులను ‘ఒక చిన్న వర్గం’ అంటూనే అలాగని దీన్ని కూడా తక్కువ చేయలేమని సజ్జల అన్నారు. కమ్యూనిస్టులతో ఎక్కువగా ఉండే పీడీఎ్‌ఫతో జట్టుకట్టి టీడీపీ గెలిచిందని తెలిపారు.

Updated Date - 2023-03-19T03:05:09+05:30 IST