మోదీ రైతులకు చేస్తున్నది ఇదీ.. వైసీపీకి బీజేపీ కౌంటర్
ABN , First Publish Date - 2023-03-02T03:38:40+05:30 IST
రైతులకు నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇస్తున్నది రూ.6వేల కోట్లు మాత్రమే కాదని, 24 పథకాల ద్వారా అన్నదాతకు అండగా నిలుస్తున్నారని రాష్ట్ర బీజేపీ తెలిపింది.
అమరావతి, మార్చి 1(ఆంధ్రజ్యోతి): రైతులకు నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇస్తున్నది రూ.6వేల కోట్లు మాత్రమే కాదని, 24 పథకాల ద్వారా అన్నదాతకు అండగా నిలుస్తున్నారని రాష్ట్ర బీజేపీ తెలిపింది. రాష్ట్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులు, నేతలు కేంద్ర ప్రభుత్వ సాయంపై పెదవి విరుస్తుండటంతో ఏపీ బీజేపీ నేతలు అదే స్థాయిలో తిప్పికొడుతున్నారు.