రాష్ట్రానికి చంద్రబాబు కావాలి

ABN , First Publish Date - 2023-02-05T06:29:02+05:30 IST

రాజధానిగా అమరావతే కావాలి. చంద్ర బాబుతోనే అమరావతి అభి వృద్ధి చెందుతుంది. రాష్ట్రానికి చంద్రబాబు కావాలి’.

రాష్ట్రానికి చంద్రబాబు కావాలి

ఆయనతోనే అమరావతి అభివృద్ధి సాధ్యం

వైసీపీ యువ నాయకుడి ప్రశంసలు

టీడీపీ అధినేతతో మీరావలి సెల్ఫీ వీడియో

అమరావతి, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి): ‘రాజధానిగా అమరావతే కావాలి. చంద్ర బాబుతోనే అమరావతి అభి వృద్ధి చెందుతుంది. రాష్ట్రానికి చంద్రబాబు కావాలి’.. ఈ మాటలన్నది టీడీపీ వారో, అమరావతి ప్రాంతం వారో కాదు.. అధికార వైసీపీ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి షేక్‌ మీరావలి టీడీపీ అధినేతపై ప్రశంసలు కురిపించారు. ఆయన మాట్లాడిన వీడియో వైరల్‌ అవుతోంది. రెండు రోజుల క్రితం చంద్రబాబు ఇండిగో విమానంలో విజయవాడ నుంచి హైదరాబాద్‌ వెళ్లారు. అదే విమానంలో ఉన్న మీరావలి చంద్రబాబును చూసి, ఆయన వద్దకు వెళ్లి పరిచయం చేసుకున్నారు. చంద్రబాబుతో సెల్ఫీ తీసుకోవడంతోపాటు సెల్ఫీ వీడియోలో మాట్లాడారు. ‘‘నేను వైసీపీ అని చెప్పినా చంద్రబాబు నన్ను పక్కన కూర్చోబెటుకుని మాట్లాడారు. ఆయన ఉన్నతికి అది నిదర్శనం. ప్రత్యేక విమానంలో ప్రయాణించకుండా మాలాగే సాధారణ విమానాల్లో ఆయన తిరుగుతున్నారు. రాజధాని కోసం ఆయన ఎంత శ్రమించారో అందరికీ తెలుసు. మాకు రాజధాని కావాలి. రాజధానిగా అమరావతే కావాలి. ఆయనతోనే అమరావతి అభివృద్ధి చెందుతుంది. రాజకీయాలు పక్కన పెడితే రాష్ట్రానికి చంద్రబాబు కావాలి. జై చంద్రబాబు... జై అమరావతి’’ అని మీరావలి ఆ వీడియోలో పేర్కొన్నారు. ఈ వీడియోను తెలుగుదేశం పార్టీ తన ట్విటర్‌ ఖాతాలో శనివారం పోస్టు చేసింది.

Updated Date - 2023-02-05T06:29:03+05:30 IST