సత్యకుమార్‌పై దాడి దారుణం

ABN , First Publish Date - 2023-04-03T01:39:31+05:30 IST

అమరావతి రైతులకోసం రాజధానికి వచ్చిన సత్యకుమార్‌పై వైసీపీ నేతలు దాడి చేయడం దారుణమని బీజేపీ నేత సుజనా చౌదరి అన్నారు.

సత్యకుమార్‌పై దాడి దారుణం

త్వరలోనే ప్రజలు వైసీపీకి బుద్ధిచెప్పే రోజు: సుజనా

గుంటూరు, ఏప్రిల్‌ 2(ఆంధ్రజ్యోతి): అమరావతి రైతులకోసం రాజధానికి వచ్చిన సత్యకుమార్‌పై వైసీపీ నేతలు దాడి చేయడం దారుణమని బీజేపీ నేత సుజనా చౌదరి అన్నారు. ఆదివారం గుంటూరు వచ్చిన ఆ యన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌ ఇంట్లో తేనీటి విందుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రులు నక్కా ఆనంద్‌బాబు, కన్నా లక్ష్మీనారాయణ, కందుకూరి వీరయ్య ఆయనను కలిశారు. అమరావతినే రాజధానిగా ఉంచాలన్నదే బీజేపీ మాట అని మాటల మధ్యలో సుజన చెప్పారు. సుజనా మాట్లాడుతూ రైతుల పోరాటానికి మద్దతు తెలిపితే దాడులు చేస్తారా అన్నారు. వైసీపీకి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు త్వరలోనే ఉన్నాయని ఆయన అన్నారు.

Updated Date - 2023-04-03T01:39:31+05:30 IST