ఓటర్ల జాబితాలో పూర్తిగా అవకతవకలు
ABN , First Publish Date - 2023-03-02T01:05:53+05:30 IST
కొత్తగా విడుదలైన ఓటర్ల జాబితాలో పూర్తిగా అవకతవకలున్నాయని టీడీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు తెనాలి శ్రావణ్‌కుమార్ ఆరోపించారు.
టీడీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు తెనాలి శ్రావణ్‌కుమార్
గుంటూరు, మార్చి 1(ఆంధ్రజ్యోతి): కొత్తగా విడుదలైన ఓటర్ల జాబితాలో పూర్తిగా అవకతవకలున్నాయని టీడీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు తెనాలి శ్రావణ్‌కుమార్ ఆరోపించారు. నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో బుధ వారం ఆయన తాడికొండ నియోజకవర్గ ముఖ్య నేతల సమావేశం నిర్వ హించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో అక్రమా లకు పాల్పడి అడ్డదారిలో గెలవడానికి జగన్‌రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నాడని ఆయన విమర్శించారు. టీడీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించడం, తారుమారు చేయడం ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యగా ఆయన అభివర్ణించారు. సామాన్య ప్రజలు, ప్రతిపక్ష నాయకులపై అధికారపార్టీ గూండాలు దాడులకు తెగబడుతున్నారన్నారు. అనంతరం వివేక హత్యకు సంబంధించిన పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమంలో కంచర్ల శివరామయ్య, రామారావు, నరసింహారావు, కోటేశ్వరరావు, శ్రీనివాసరావు, సుబ్బారావు పాల్గొన్నారు.