తెలుగువారి గుండెల్లో చిరస్మరణీయుడు ఎన్టీఆర్‌

ABN , First Publish Date - 2023-05-26T00:27:51+05:30 IST

సినీ, రాజకీయ రంగాల్లో చెరగని ముద్రవేసుకుని ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా అన్న దివంగత ఎన్టీఆర్‌ నిలిచిపోయారని గణే్‌షయూత్‌ కన్వీనర్‌ తెలుగుదేశం పార్టీ నాయకులు వీరవల్లి మురళి అన్నారు.

తెలుగువారి గుండెల్లో చిరస్మరణీయుడు ఎన్టీఆర్‌
ఎన్టీఆర్‌ విగ్రహాలతో వీరవల్లి మురళి, అంగలకుదురు వైస్‌ సర్పంచ్‌ నాగభూషణం, శిల్పి వెంకటేశ్వర్లు తదితరులు

తెనాలి రూరల్‌, మే 25: సినీ, రాజకీయ రంగాల్లో చెరగని ముద్రవేసుకుని ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా అన్న దివంగత ఎన్టీఆర్‌ నిలిచిపోయారని గణే్‌షయూత్‌ కన్వీనర్‌ తెలుగుదేశం పార్టీ నాయకులు వీరవల్లి మురళి అన్నారు. తెనాలి పట్టణంలోని సూర్యశిల్పశాలలో త్రీడీ టెక్నాలజీతో విదేశాలకు తరలించేందుకు రూపుదిద్దుకున్న ఎన్టీఆర్‌ విగ్రహాలను బుధవారం శిల్పులూ కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్ర, శ్రీహర్షలు ప్రదర్శనకు ఉంచారు. ముఖ్య అతిథిగా గణే్‌షయూత్‌ కన్వీనర్‌, టీడీపీ నాయకులు వీరవల్లిమురళి, అంగలకుదరు ఉప సర్పంచ్‌ కనగాల నాగభూషణం హాజరై వాటిని తిలకించారు. ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ అన్న ఎన్టీఆర్‌ శతజయంతిని పురస్కరించుకుని తెనాలిలోని ప్రముఖ సూర్యశిల్పశాలలో శిల్పులు కాటూరి వెంకటేశ్వర్లు, రవిచంద్ర, శ్రీహర్షలు త్రీడీ టెక్నాలజీని ఉపయోగించి తయారుచేసిన ఎన్టీఆర్‌ విగ్రహాలు ఆకర్షణీయంగా ఉన్నాయని వారిని అభినందించారు. ఇక్కడ తయారు చేసి ప్రదర్శనకు ఉంచిన 3 అంగుళాల సైజు నుంచి రెండున్నల అడుగుల విగ్రహాలు అమెరికా, ఆస్టేలియా, కెనడా. జర్మనీ లాంటి దేశాలకు వీటిని పంపనున్నట్లు శిల్పశాల నిర్వాహకులు వెంకటేశ్వర్లు తెలిపారు. కార్యక్రమంలో గణేష్‌ యూత్‌ సభ్యులు బొద్దులూరు వేణు, ఖాదర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-05-26T00:27:51+05:30 IST